తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shreyas Iyer | రోహిత్ రికార్డుపై కన్నేసిన శ్రేయస్.. అడుగు దూరంలో అరుదైన ఘనత

Shreyas Iyer | రోహిత్ రికార్డుపై కన్నేసిన శ్రేయస్.. అడుగు దూరంలో అరుదైన ఘనత

07 June 2022, 7:17 IST

google News
    • శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనతకు అడుగు దూరంలో ఉన్నాడు. టీ20ల్లో మరో 191 పరుగులు చేస్తే ఈ ఫార్మాట్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన 8వ భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. అంతేకాకుండా రోహిత్ శర్మను కూడా అధిగమించే అవకాశముంది.
శ్రేయస్ అయ్యర్
శ్రేయస్ అయ్యర్ (PTI)

శ్రేయస్ అయ్యర్

రెండు నెలల పాటు ఉల్లాసంగా సాగిన ఐపీఎల్ ముగింపు పలికి.. ఫోకస్‌ను అంతర్జాతీయ మ్యాచ్‌లపై దృష్టి పెట్టింది టీమిండియా. అంతేకాకుండా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ కూడా ఉండటంతో పొట్టి ఫార్మాట్‌లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతూ.. టీ20 ప్రపంచ కప్పే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్‌లో మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎలాగైన సఫారీలపై సత్తా చాటాలని ఆశపడుతున్నాడు. అంతేకాకుండా టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డును అధిగమించాలని చూస్తున్నాడు.

శ్రేయస్ అయ్యర్ మరో 191 పరుగులు చేస్తే పొట్టి ఫార్మాట్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన 8వ భారత బ్యాటర్‌గా కీర్తి గడిస్తాడు. ఇప్పటికే రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ లాంటి ఆటగాళ్లు టీ20ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశారు. అంతేకాకుండా అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన మూడో భారత బ్యాటర్‌గా ఘనత సాధించే అవకాశం శ్రేయాస్‌కు ఉంది.

టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ప్లేయర్లు..

- విరాట్ కోహ్లీ.. 2015లో 29 మ్యాచ్‌ల్లో 1000 పూర్తి

- కేఎల్ రాహుల్.. 2019లో 32 మ్యాచ్‌ల్లో ఘనత

- రోహిత్ శర్మ.. 47 మ్యాచ్‌ల్లో 2016లో రికార్డు.

శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే 36 మ్యాచ్‌ల్లో 36.77 సగటుతో 809 పరుగులు పూర్తి చేశాడు. అంతేకాకుండా 140 మెరుగైన స్ట్రైక్‌రేటుతో ఆడుతున్నాడు. దీంతో మరో 191 పరుగులు చేస్తే వెయ్యి పరుగుల క్లబ్‌లో ఈ మిడిలార్డర్ బ్యాటర్‌కు చోటు దక్కుతుంది. కాబట్టి సౌతాఫ్రికాతో జరగనున్న 5 మ్యాచ్‌ల సిరీస్‌లో సత్తా చాటితే రోహిత్ శర్మ రికార్డును అధిగమించి.. టీ20ల్లో వేగంగా 1000 పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా రికార్డు సాధిస్తాడు.

ఐపీఎల్‌లో శ్రేయస్ మెరుగ్గా ఆడాడు. కేకేఆర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూనే 14 మ్యాచ్‌ల్లో 401 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో మూడు అర్ధశతకాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం జూన్ 9 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి నివ్వగా.. ఈ ఐపీఎల్ సీజన్‌లో సత్తా చాటిన శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, రిషభ్ పత్, దినేశ్ కార్తీక్‌కు అవకాశం దక్కింది.

టాపిక్

తదుపరి వ్యాసం