తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shohei Ohtani: మెస్సీ రికార్డు బ్రేక్ చేసిన బేస్‌బాల్ సెన్సేషన్.. పదేళ్ల కాంట్రాక్టుకు రూ.5837 కోట్లు

Shohei Ohtani: మెస్సీ రికార్డు బ్రేక్ చేసిన బేస్‌బాల్ సెన్సేషన్.. పదేళ్ల కాంట్రాక్టుకు రూ.5837 కోట్లు

Hari Prasad S HT Telugu

11 December 2023, 11:07 IST

google News
    • Shohei Ohtani: జపాన్‌కు చెందిన బేస్‌బాల్ సెన్సేషన్ షోహీ ఒహ్తానీ ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ రికార్డు బ్రేక్ చేశాడు. లాస్ ఏంజిల్స్ డాడ్జర్స్ తో పదేళ్ల కాంట్రాక్టు కోసం ఏకంగా రూ.5837 కోట్లు అందుకోబోతున్నాడు.
బేస్‌బాల్ ప్లేయర్ షోహీ ఒహ్తానీ
బేస్‌బాల్ ప్లేయర్ షోహీ ఒహ్తానీ (AP)

బేస్‌బాల్ ప్లేయర్ షోహీ ఒహ్తానీ

Shohei Ohtani: స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ ఫీల్డ్ బయట క్రియేట్ చేసిన ఓ రికార్డును జపాన్ బేస్‌బాల్ ప్లేయర్ షోహీ ఒహ్తానీ బ్రేక్ చేశాడు. స్పోర్ట్స్ లో రికార్డులు ఉన్నవి బ్రేక్ చేయడానికే అంటారు. ఫీల్డ్ లోపల అయినా బయట అయినా కొత్త కొత్త రికార్డులు క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒహ్తానీ ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యధిక మొత్తం డీల్ అందుకొని అలాంటి రికార్డు క్రియేట్ చేశాడు.

లియోనెల్ మెస్సీ గతంలో బార్సిలోనా జట్టుతో నాలుగేళ్లకుగాను 67.4 కోట్ల డాలర్ల (సుమారు రూ.5600 కోట్లు)కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పుడీ రికార్డును షోహీ ఒహ్తానీ బ్రేక్ చేశాడు. ఈ బేస్‌బాల్ ప్లేయర్ తో లాస్ ఏంజిల్స్ డాడ్జర్స్ ఏకంగా 70 కోట్ల డాలర్ల (సుమారు రూ.5837 కోట్లు)కు పదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం.

స్పోర్ట్స్ చరిత్రలో ఇదే అతి పెద్ద డీల్ అని బీబీసీ రిపోర్ట్ వెల్లడించింది. యూఎస్ మేజర్ లీగ్ బేస్‌బాల్ (ఎంఎల్‌బీ)లో ఇదే అతి పెద్ద డీల్. ఈ ఒక్క డీల్ తోనే ప్రపంచంలో అత్యధిక మొత్తం సంపాదిస్తున్న అథ్లెట్ల జాబితాలో ఒహ్తానీ చేరిపోయాడు. ఈ మధ్య కాలంలో బేస్‌బాల్ లో సంచలనాలు క్రియేట్ చేస్తున్న ప్లేయర్ గా ఒహ్తానీకి పేరుంది.

ఇప్పటి వరకూ బేస్‌బాల్ ఆడిన అత్యుత్తమ ప్లేయర్స్ లో ఒకడిగా ఒహ్తానీని కీర్తిస్తున్నారు. ఆరేళ్లుగా లాస్ ఏంజిల్స్ ఏంజిల్స్ టీమ్ తరఫున ఆడుతున్న ఒహ్తానీ కాంట్రాక్ట్ ఈ మధ్యే పూర్తవడంతో అతడు ఫ్రీ ఏజెంట్ గా మారాడు. అప్పటి నుంచీ అతనిపై బిడ్డింగ్ వార్ నడుస్తోంది. చివరికి లాస్ ఏంజిల్స్ డాడ్జర్స్ అతన్ని భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.

బేస్‌బాల్ చరిత్రలో ఇప్పటి వరకూ అత్యధిక మొత్తంగా ఉన్న కాంట్రాక్ట్ కంటే కూడా ఒహ్తానీ కాంట్రాక్ట్ 64 శాతం ఎక్కువ కావడం విశేషం. గతంలో ఏంజిల్స్ ఔట్ ఫీల్డర్ మైక్ ట్రౌట్ 12 ఏళ్లకుగాను 42.6 కోట్ల డాలర్లు అందుకున్నాడు. 2019లో అతని కాంట్రాక్ట్ మొదలైంది.

టాపిక్

తదుపరి వ్యాసం