తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sania Mirza Wins: చివరి గ్రాండ్‌స్లామ్‌ను విజయంతో మొదలుపెట్టిన సానియా మీర్జా

Sania Mirza Wins: చివరి గ్రాండ్‌స్లామ్‌ను విజయంతో మొదలుపెట్టిన సానియా మీర్జా

Hari Prasad S HT Telugu

19 January 2023, 16:18 IST

    • Sania Mirza Wins: తన కెరీర్ లో చివరి గ్రాండ్‌స్లామ్‌ను విజయంతో మొదలుపెట్టింది సానియా మీర్జా. ఆస్ట్రేలియన్ ఓపెన్ వుమెన్స్ డబుల్స్ తొలి రౌండ్ లో గెలిచి రెండో రౌండ్ లో అడుగుపెట్టింది.
సానియా మీర్జా
సానియా మీర్జా

సానియా మీర్జా

Sania Mirza Wins: హైదరాబాదీ టెన్నిస్ సెన్సేషన్ సానియా మీర్జా తన కెరీర్ లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెనే అని అనౌన్స్ చేసిన విషయం తెలుసు కదా. ఈ టోర్నీ తర్వాత ఆమె టెన్నిస్ కు గుడ్ బై చెప్పనుంది. ఇప్పుడీ గ్రాండ్‌స్లామ్ వుమెన్స్ డబుల్స్ తొలి రౌండ్లో సానియా విజయం సాధించింది. తన డబుల్స్ భాగస్వామి ఏనా డానిలినాతో కలిసి బరిలోకి దిగిన సానియా.. అమెరికా, హంగరీ జోడీ బెర్నార్నాడా పెరా, డాల్మా గల్ఫీపై 6-2, 7-5 తేడాతో వరుస సెట్లలో గెలిచింది.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ వుమెన్స్ డబుల్స్ లో సానియా, డానిలినా జోడీ 8వ సీడ్ గా బరిలోకి దిగింది. తొలి సెట్ ను వీళ్లిద్దరూ కేవలం 25 నిమిషాల్లోనే 6-2తో గెలుచుకున్నారు. తొలి సెట్ లో సానియా తన ఫోర్ హ్యాండ్ షాట్లతో చెలరేగింది. రెండో సెట్ లోనూ మొదట్లోనే రెండు బ్రేక్స్ సాధించి 4-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఆ తర్వాత తడబడింది. ఆరో గేమ్ లో సానియా డబుల్ ఫాల్ట్ తో ప్రత్యర్థి జోడీ మళ్లీ పుంజుకుంది. అయితే చివరికి 7-5తో సెట్ తోపాటు మ్యాచ్ ను కూడా గెలుచుకుంది.

గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ చేరిన సానియా, డానిలినా జోడీ.. ఇప్పుడు తమ రెండో రౌండ్ లో ఉక్రెయిన్-బెల్జియన్ జోడీ అనెలినా కలినినా, అలీసన్ వాన్ తో తలపడనుంది. వుమెన్స్ డబుల్స్ లోనే కాదు.. రోహన్ బోపన్నతో కలిసి సానియా మిక్స్‌డ్ డబుల్స్ లోనూ బరిలోకి దిగనుంది. కెరీర్లో సానియా ప్రస్తుతం చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతోంది.

దీని తర్వాత ఫిబ్రవరిలో జరిగే దుబాయ్ మాస్టర్స్ టోర్నీ తర్వాత ఆమె టెన్నిస్ నుంచి తప్పుకోనుంది. గతేడాదే తాను రిటైరవనున్నట్లు సానియా మొదట చెప్పినా.. గాయం కారణంగా యూఎస్ ఓపెన్ కు దూరం కావడంతో.. ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడి తప్పుకోవాలని నిర్ణయించింది. మొత్తం ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన సానియా.. అందులో రెండు ఆస్ట్రేలియాలో గెలుచుకుంది.

తదుపరి వ్యాసం