తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sania Mirza: ఇన్‍స్టాగ్రామ్ బయో మార్చిన షోయబ్ మాలిక్.. సానియా మీర్జాతో విడిపోనున్నాడా!

Sania Mirza: ఇన్‍స్టాగ్రామ్ బయో మార్చిన షోయబ్ మాలిక్.. సానియా మీర్జాతో విడిపోనున్నాడా!

03 August 2023, 14:04 IST

    • Sania Mirza - Shoaib Malik: సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులపై రూమర్లు మళ్లీ ఊపందుకున్నాయి. షోయబ్ మాలిక్ చేసిన తాజా చర్యతో డైవర్స్ అంశం మరోసారి చర్చకు వచ్చింది.
Sania Mirza: షోయబ్ మాలిక్ చేసిన పనితో మళ్లీ విడాకుల రూమర్లు..
Sania Mirza: షోయబ్ మాలిక్ చేసిన పనితో మళ్లీ విడాకుల రూమర్లు..

Sania Mirza: షోయబ్ మాలిక్ చేసిన పనితో మళ్లీ విడాకుల రూమర్లు..

Sania Mirza - Shoaib Malik: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటారని చాలా రోజుల నుంచి రూమర్లు వస్తూనే ఉన్నాయి. వారు విడిపోతారంటూ సుమారు సంవత్సరంగా సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఈ రూమర్లపై సానియా, మాలిక్ దంపతులు ఎప్పుడూ స్పష్టంగా స్పందించలేదు. గత నవంబర్‍లో సానియా చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ రూమర్లకు మరింత బలం తెచ్చింది. అయితే, మీర్జా అండ్ మాలిక్ అంటూ వీరిద్దరూ కలిసి ఓ షోను హోస్ట్ చేయడంతో రూమర్లు ఆగాయి. అయితే, ఇప్పుడు షోయబ్ మాలిక్ చేసిన ఓ పనితో మళ్లీ విడాకుల ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తాజాగా తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్ బయోను మార్చాడు. అంతకు ముందు హస్బెండ్ ఆఫ్ ఏ సూపర్ ఉమెన్ మీర్జాసానియా (సానియా మీర్జా అనే సూపర్ ఉమెన్‍కు భర్త) అని మాలిక్ ఇన్‍స్టా బయోలో ఉండేది. అయితే, దీన్ని ఇప్పుడు తొలగించాడు మాలిక్. హస్బెండ్ ఆఫ్ ఏ సూపర్ ఉమెన్ అనే దాన్ని తీసేశాడు. అయితే, ఫాదర్ టు వన్ ట్రూ బ్లెస్సింగ్ (కుమారుడిని ఉద్దేశిస్తూ) అనే వాక్యాన్ని మాత్రం అలాగే ఉంచాడు. సానియా భర్తను అనే పదాలను ఇన్‍స్టా బయో నుంచి షోయబ్ మాలిక్ తొలగించడంతో విడాకుల రూమర్లు మళ్లీ గుప్పుమంటున్నాయి.

2010 ఏప్రిల్ 12న హైదరాబాద్‍లో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ వివాహం ముస్లిం సంప్రదాయ పద్ధతిలో జరిగింది. అనంతరం వలీమా పాకిస్థాన్‍లోని సియాల్కోట్‍లో జరిగింది. 2018లో మగపిల్లాడు ఇజాన్‍కు జన్మనిచ్చింది సానియా. వీరిద్దరూ మంచి జంటగా పేరు తెచ్చుకున్నారు. అయితే, గతేడాది నవంబర్‌లో వీరి విడాకుల ఊహాగానాలు తొలిసారి బయటికి వచ్చాయి. సానియా, షోయబ్ వేర్వేరుగా ఉంటున్నారని, కుమారుడిని ఇద్దరూ చూసుకునేలా న్యాయపరమైన అంశాలను సెటిల్ చేసుకుంటున్నారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. సానియా, షోయబ్ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు కూడా ఈ పుకార్లకు ఆజ్యం పోశాయి. అయితే, మీర్జా అండ్ మాలిక్ షోను కలిసి చేసి ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆ ఇద్దరూ ప్రయత్నించారు. అయితే, విడాకుల వార్తలను మాత్రం నేరుగా ఖండించలేదు.

పాకిస్థాన్ నటి అయేషా ఓమర్‌కు షోయబ్ మాలిక్ దగ్గరవుతున్నాడంటూ పాక్ మీడియాలో రూమర్లు వచ్చాయి. ఓ మ్యాగజీన్‍కు వారిద్దరూ ఫొటోషూట్ ఇచ్చాక ఇది మొదలైంది. ఈ రూమర్లను అయేషా కొట్టిపారేసింది. అయితే, ఇప్పుడు షోయబ్ మాలిక్ ఇన్‍స్టా బయో మార్చటంతో సానియాతో విడాకుల ఊహాగానాలు మళ్లీ పెరుగుతున్నాయి.

తదుపరి వ్యాసం