తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sania Mirza Australian Open 2023: చివ‌రి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైన‌ల్ చేరిన సానియా - టైటిల్‌కు అడుగు దూరంలో

Sania Mirza Australian Open 2023: చివ‌రి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైన‌ల్ చేరిన సానియా - టైటిల్‌కు అడుగు దూరంలో

26 January 2023, 10:20 IST

  • Sania Mirza Australian Open 2023: ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ 2023 మిక్స‌డ్ డ‌బుల్స్‌లో సానియా మీర్జా - రోహ‌న్ బోప‌న్న జోడి ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. కెరీర్‌లో చివ‌రి గ్రాండ్‌స్లామ్‌లో ఫైన‌ల్ చేరుకొని చ‌రిత్ర‌ను సృష్టించింది సానియా మీర్జా.

సానియా మీర్జా
సానియా మీర్జా

సానియా మీర్జా

Sania Mirza Australian Open 2023: ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ 2023 మిక్స్‌డ్ డ‌బుల్స్‌లో సానియా మీర్జా ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. ఈ గ్లాండ్‌స్లామ్‌లో ఇండియ‌న్ ప్లేయ‌ర్ రోహ‌న్ బోప‌న్న‌తో బ‌రిలో దిగింది సానియా మీర్జా.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

అద్భుత ఆట‌తీరుతో దూసుకుపోతున్న సానియా - బోప‌న్న జోడి బుధ‌వారం జ‌రిగిన సెమీఫైన‌ల్‌లో నీల్ సుపాస్కి డిసీర్ క్రాజెక్ ల‌పై 7-6 6-7 10-6 తేడాతో విజ‌యాన్ని సాధించి గ్లాండ్‌స్లామ్ ఫైన‌ల్‌లో అడుగుపెట్టారు. శ‌నివారం జ‌రుగ‌నున్న ఫైన‌ల్‌లో స్టెఫానీ, మాథోస్‌ల‌తో సానియా - బోప‌న్న త‌ల‌ప‌డ‌నున్నారు.

కెరీర్‌లో సానియా మీర్జాకు ఇదే చివ‌రి గ్లాండ్‌స్టామ్ టోర్న‌మెంట్ కావ‌డం గ‌మ‌నార్హం. ఫిబ్ర‌వ‌రిలో టెన్నిస్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లే సానియా మీర్జా వెల్ల‌డించింది. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టైటిల్ గెలిచి కెరీర్‌ను ఘ‌నంగా ముగించే అవ‌కాశం సానియాకు ల‌భించింది.

ఫైన‌ల్‌లో సానియా - బోప‌న్న జోడి ఇదే జోరును కొన‌సాగించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు రెండు సార్లు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టైటిల్ అందుకున్న‌ది సానియా మీర్జా. ఒక‌సారి మిక్స‌డ్ డ‌బుల్స్‌, మ‌రోసారి ఉమెన్స్ డ‌బుల్స్‌లో విజేత‌గా నిలిచింది. మ‌రో మూడు సార్లు ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకున్న‌ది.

టాపిక్

తదుపరి వ్యాసం