తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Sharma Ipl Income: ఐపీఎల్ సంపాద‌న‌లో రోహిత్ టాప్ - ధోనీ రికార్డ్ బ్రేక్‌

Rohit Sharma Ipl Income: ఐపీఎల్ సంపాద‌న‌లో రోహిత్ టాప్ - ధోనీ రికార్డ్ బ్రేక్‌

21 March 2023, 18:07 IST

google News
  • Rohit Sharma Ipl Income: ఐపీఎల్ ద్వారా అత్య‌ధిక వేత‌నాన్ని ఆర్జించిన క్రికెట‌ర్‌గా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ జాబితాలో ఉన్న మిగిలిన క్రికెట‌ర్లు ఎవ‌రంటే...

ధోనీ, రోహిత్ శ‌ర్మ‌
ధోనీ, రోహిత్ శ‌ర్మ‌

ధోనీ, రోహిత్ శ‌ర్మ‌

Rohit Sharma Ipl Income: ఐపీఎల్‌లో ధోని రికార్డ్‌ను రోహిత్ శ‌ర్మ అధిగ‌మించాడు. అయితే ఆట‌తో కాదు. ఐపీఎల్ లీగ్ ద్వారా వేత‌నాల రూపంలో అత్య‌ధిక ఆదాయాన్ని ఆర్జించిన‌ ఆట‌గాడిగా ధోనీ రికార్డ్‌ను రోహిత్ శ‌ర్మ తిర‌గ‌రాశాడు. మొత్తం 16 సీజ‌న్స్‌లో క‌లిపి రోహిత్ శ‌ర్మ 178.6 కోట్ల వేత‌నాన్ని అందుకున్నాడు. రోహిత్ త‌ర్వాత ధోని 176.84 కోట్లు ఆర్జించాడు. ఈ జాబితాలో 173. 2 కోట్ల‌తో విరాట్ కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు.

110 కోట్ల‌తో రైనా నాలుగో స్థానంలో, 109 కోట్ల జ‌డేజా ఐదో స్థానంలో నిలిచారు. వీరి త‌ర్వాత వెస్టిండీస్ ఆట‌గాడు సునీల్ న‌రైన్ నిల‌వ‌డం గ‌మ‌నార్హం. టాప్ టెన్‌లో సునీల్ న‌రైన్‌తో పాటు సౌతాఫ్రికా స్టార్ ప్లేయ‌ర్ డివిలియ‌ర్స్ కూడా ఉన్నాడు. ఐపీఎల్ ఫ‌స్ట్ సీజ‌న్‌లో ధోనీని ఆరు కోట్ల‌కు చెన్నై కొనుగులు చేసింది. ఆ సీజ‌న్‌లో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ప్లేయ‌ర్‌గా ధోనీ నిలిచాడు.

గ‌త సీజ‌న్‌లో త‌న వేత‌నాన్ని త‌గ్గించుకున్న ధోనీ కేవ‌లం 12 కోట్ల మాత్ర‌మే తీసుకున్నాడు. మ‌రోవైపు ఐపీఎల్ ఫ‌స్ట్ సీజ‌న్‌లో రోహిత్ శ‌ర్మ‌ను మూడు కోట్ల‌కు డెక్క‌న్ ఛార్జ‌ర్స్ కొనుగోలు చేసింది. గ‌త సీజ‌న్ నుంచి ముంబాయి ఇండియ‌న్స్ అత‌డికి 16 కోట్లు చెల్లిస్తూ వ‌స్తోంది.

అత‌డి కంటే విరాట్ కోహ్లి కోటి రూపాయ‌లు త‌క్కువ వేత‌నాన్ని అందుకుంటున్నాడు. 2021 సీజ‌న్ వ‌ర‌కు విరాట్ కోహ్లికి 17 కోట్లు చెల్లిస్తూ వ‌చ్చిన బెంగ‌ళూరు రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ గ‌త సీజ‌న్ నుంచి 15 కోట్ల‌కు త‌గ్గించింది.

తదుపరి వ్యాసం