Rohit Sharma Rare Record: అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ అరుదైన రికార్డ్ - ఏడో టీమ్ ఇండియా ప్లేయర్‌గా ఘనత
11 March 2023, 11:07 IST
Rohit Sharma Rare Record: అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 17000 పరుగులు పూర్తిచేసుకున్న ఏడో టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
రోహిత్ శర్మ
Rohit Sharma Rare Record: ఇంటర్‌నేషనల్ క్రికెట్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. మూడు ఫార్మెట్స్‌లో కలిపి 17 వేల పరుగుల్ని పూర్తిచేసుకున్నాడు. ఈ మైలురాయిని అందుకున్న ఏడో టీమ్ ఇండియా క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న నాలుగో టెస్ట్ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ 17000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
టీమ్ ఇండియా తరఫున మూడు ఫార్మెట్స్‌లో కలిపి అత్యధిక పరుగులు చేసిన టీమ్ ఇండియా క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ (34 357 రన్స్) ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. అతడి తర్వాత విరాట్ కోహ్లి, రాహుల్ ద్రావిడ్, సౌరభ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, ఈ జాబితాలో ఉన్నారు.
వారి తర్వాత పదిహేడు వేల పరుగులతో రోహిత్ శర్మ ఆరో స్థానంలో నిలిచాడు. అంతే కాకుండా గంగూలీ తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో 17 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలో దిగిన రోహిత్ శర్మ 35 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో 2-1 తేడాతో టీమ్ ఇండియా ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌ను టీమ్ ఇండియా నెగ్గాలంటే నాలుగో టెస్ట్‌లో విజయం తప్పనిసరిగా మారింది. నాలుగో టెస్ట్‌లో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగుల భారీ స్కోరు చేసింది.