Rohan Bopanna Record: భారత టెన్నిస్ స్టార్ బోపన్న అరుదైన ఘనత.. 43 ఏళ్ల వయస్సులో రికార్డు బ్రేక్ ప్రదర్శన
19 March 2023, 15:23 IST
Rohan Bopanna Record: భారత టెన్నిస్ స్టార్ బోపన్న ఏటీపీ మాస్టర్స్-1000 టైటిల్ గెలిచిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఇది అతడికి ఐదో ఏటీపీ టైటిల్ కాగా.. 2017 తర్వాత గెలవడం ఇదే మొదటిసారి.
మ్యాథ్యూతో రోహన్ బోపన్న
Rohan Bopanna Record: భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న అరుదైన ఘనత సాధించాడు. ఈ ఏడాది ఇప్పటితే అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ అదరగొడుతున్న బోపన్న.. కాలిఫోర్నియాలో జరిగిన ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్-1000 టోర్నీలో గెలిచి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఏటీపీ మాస్టర్స్ టైటిల్ నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 43 ఏళ్ల వయసులో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు ఈ టెన్నిస్ దిగ్గజం.
ఈ టోర్నీలో బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ ద్వయం టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో కుహ్లోప్-స్కుప్సికిటో జోడీపై 6-3, 2-6, 10-8 తేడాతో విజయం సాధించింది. ఫలితంగా టైటిల్‌ను చేజిక్కించుంది. దీంతో ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్‌ను గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా రోహన్ బోపన్న(43) రికార్డు సృష్టించాడు. దీంతో కెనడాకు చెందిన డానియలె నెస్టర్ రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు. 42 ఏళ్ల వయస్సులో నెస్టర్ 2015లో సిన్సినాటి మాస్టర్స్ టైటిల్‌ను సాధించాడు.
మొత్తంగా బోపన్న కెరీర్‌లో ఇది ఐదో ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్ కావడం విశేషం. 2017లో మాంటేకార్లో ఏటీపీ మాస్టర్స్ టైటిల్ తర్వాత బోపన్న టోర్నీ విజేతగా నిలవడం ఇదే తొలిసారి. రోహన్ తాజా విజయంపై క్రీడా సమాజం నుంచి ప్రశంసల వర్షం వెల్లువెత్తుతోంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే రోహన్-మ్యాత్యూ ద్వయం ఫైనల్లో కుహ్లోప్-స్కుప్సికిటో జోడీపై 6-3, 2-6, 10-8 తేడాతో విజయం సాధించింది. తొలి గేమ్‌ను 6-3తో సొంతం చేసుకున్న రోహన్ ద్వయం.. రెండో సెట్‌లో మాత్రం ప్రత్యర్థి చేతిలో ఓడిపోయారు. కీలకమైన మూడో సెట్‌లో బోపన్న ద్వయం పుంజుకుని 10-8 తేడాతో గేమ్‌ను కైవసం చేసుకుని టైటిల్‌ను కొల్లగొట్టింది.
టాపిక్