Rishabh Pant Accident: రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు
30 December 2022, 9:59 IST
Rishabh Pant Accident: టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. రూర్కీ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పంత్ కారు పూర్తిగా దగ్ధమైంది.
రిషబ్ పంత్
Rishabh Pant Accident: టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ ప్రయాణిస్తోన్న కారు రోడ్డు పక్కన డివైడర్ రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పంత్ తలతో పాటు కాలుకు తీవ్ర గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.
పంత్ కారులో ఉత్తరఖండ్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తోన్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. రూర్కీ సమీపంలో హమందాపూర్ ఝల్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ యాక్సిడెంట్ జరిగింది. పంత్ ప్రయాణిస్తోన్న బీఏండబ్ల్యూ కారు అదుపుతప్పి వేగంగా రేయిలింగ్‌ను ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది.
తృటిలో ప్రాణాలతో పంత్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డట్లు సమాచారం. ప్రమాదం జరిగిన అనంతరం స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించనున్నట్లు తెలిసింది. పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించబోతున్నట్లు తెలిసింది.
టాపిక్