తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rishabh Pant Health Update: పంత్ కోలుకోవ‌డానికి ఆరు నెల‌లు ప‌డుతుంది - డాక్ట‌ర్స్ వెల్ల‌డి

Rishabh Pant Health Update: పంత్ కోలుకోవ‌డానికి ఆరు నెల‌లు ప‌డుతుంది - డాక్ట‌ర్స్ వెల్ల‌డి

31 December 2022, 11:27 IST

  • Rishabh Pant Health Update: రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన టీమ్ ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ కోలుకోవ‌డానికి దాదాపు ఆరు నెల‌లు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు వైద్య‌బృందం ప్ర‌క‌టించింది. పంత్‌ను కాపాడిన డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌కు దిగ్గ‌జ క్రికెట్ ల‌క్ష్మ‌ణ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

రిష‌బ్ పంత్
రిష‌బ్ పంత్

రిష‌బ్ పంత్

Rishabh Pant Health Update: రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన టీమ్ ఇండియా వికెట్ కీప‌ర్‌ రిష‌బ్ పంత్ ఈ ఏడాది మైదానంలో అడుగుపెట్ట‌డం అనుమానంగానే క‌నిపిస్తోంది. అత‌డు కోలుకోవ‌డానికి దాదాపు అరు నెల‌ల కంటే ఎక్కువ స‌మ‌యంప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వస్తుండగా రూర్కీ సమీపంలో పంత్ ప్రయాణిస్తోన్న కారు అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో పంత్‌కు తీవ్రంగా గాయాలు అయ్యాయి. నుదిటిపై గాయాలు కావ‌డంతో పాటు కుడి మోకాలులో చీలిక ఏర్ప‌డింది. అంతేకాకుండా కుడి చేతి మ‌ణిక‌ట్టుతో పాటు మ‌డ‌మ వ‌ద్ద గాయాలు అయిన‌ట్లు బీసీసీఐ తెలిపింది.

కాగా కుడి మోకాలులో చీల‌క తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వైద్యులు పేర్కొన్నారు.ఈ గాయం నుంచి పంత్ పూర్తిగా కోలుకోవ‌డానికి మూడు నుంచి ఆరు నెల‌ల వ‌ర‌కు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం అత‌డి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు ప్ర‌మాద‌మేమి లేద‌ని ప్ర‌క‌టించారు.

ఈ కుడి మోకాలు చీలిక‌కు సంబంధించి బీసీసీఐ మెడిక‌ల్ టీమ్ పంత్‌కు చికిత్స‌ను అందిస్తోన్న‌ట్లు స‌మాచారం. పంత్ ఆరోగ్య ప‌రిస్థితిని బీసీసీఐ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు స‌మాచారం. పంత్ కుటుంబ‌స‌భ్యుల‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు తెలిసింది.

పంత్‌ను కాపాడిన డ్రైవ‌ర్‌కు స‌న్మానం

రోడ్డు ప్ర‌మాదం నుంచి పంత్‌ను కాపాడిన డ్రైవ‌ర్ సుశీల్ మాన్‌, కండ‌క్ట‌ర్‌ల‌ను హ‌ర్యానా స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ స‌న్మానించింది. వారికి ఐదు వేల రూపాయ‌ల న‌జ‌రానాతో పాటు ప్ర‌శంసా ప‌త్రాల‌ను అంద‌జేసింది.

అంతేకాకుండా డ్రైవ‌ర్ సుశీల్ మాన్‌తో పాటు కండ‌క్ట‌ర్‌పై టీమ్ ఇండియా లెజెండ‌రీ క్రికెట‌ర్ ల‌క్ష్మ‌ణ్ ప్ర‌శంస‌ల్ని కురిపించాడు. మంట‌ల్లో ద‌గ్ధ‌మ‌వుతోన్న కారు నుంచి పంత్‌ను కాపాడిన డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. వారిని రియ‌ల్ హీరోస్ అంటూ పేర్కొన్నారు. వారి నిస్వార్థ సేవ‌ను ల‌క్ష్మ‌ణ్ అభినందించారు.

టాపిక్

తదుపరి వ్యాసం