తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rishabh Pant: 72 ఏళ్ల రికార్డు బ్రేక్‌ చేసిన రిషబ్‌ పంత్‌

Rishabh Pant: 72 ఏళ్ల రికార్డు బ్రేక్‌ చేసిన రిషబ్‌ పంత్‌

Hari Prasad S HT Telugu

04 July 2022, 19:39 IST

google News
    • Rishabh Pant: టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఇంగ్లండ్‌ గడ్డపై 72 ఏళ్ల కిందటి రికార్డు బ్రేక్‌ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన పంత్‌.. ఈ క్రమంలో ఆ అరుదైన రికార్డు అందుకున్నాడు.
రిషబ్ పంత్
రిషబ్ పంత్ (Action Images via Reuters)

రిషబ్ పంత్

బర్మింగ్‌హామ్‌: విదేశీ గడ్డపై టీమిండియాను ఆపదలో ఆదుకుంటున్నాడు వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌. ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 98 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇండియన్‌ టీమ్‌ను తన సెంచరీతో భారీ స్కోరు వైపు నడిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 111 బాల్స్‌లోనే 146 రన్స్‌ చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ 57 రన్స్‌తో టీమ్‌ ఓ మోస్తరు స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ క్రమంలో ఇంగ్లండ్‌ గడ్డపై72 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేశాడు. ఒక టెస్ట్‌ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన విజిటింగ్ వికెట్‌ కీపర్‌గా పంత్‌ నిలిచాడు. ఎప్పుడో 1950లో వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌ క్లైడ్‌ వాల్కట్‌ 182 పరుగులతో నెలకొల్పిన రికార్డు ఇప్పుడు మరుగున పడిపోయింది. ఆ టెస్ట్‌లో వాల్కట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 14, రెండో ఇన్నింగ్స్‌లో 168 రన్స్‌ చేశాడు.

ఇప్పుడు ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో వ్యక్తిగత స్కోరు 36 రన్స్‌ దగ్గర ఉన్నప్పుడు పంత్‌ ఈ రికార్డును అధిగమించాడు. ఈ టెస్ట్‌లో పంత్‌ మొత్తం 203 రన్స్‌ చేశాడు. ఈ క్రమంలో 2011లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన టెస్ట్‌లో 151 రన్స్‌ చేసిన ధోనీ రికార్డును కూడా పంత్‌ బ్రేక్‌ చేశాడు. ఆ టెస్ట్‌లో కెప్టెన్‌గా ఉన్న ధోనీ 77,74 రన్స్ చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయింది.

ఇక ఒకే టెస్ట్‌లో సెంచరీ, హాఫ్‌ సెంచరీ చేసిన రెండో ఇండియన్‌ వికెట్‌ కీపర్‌గా పంత్‌ నిలిచాడు. గతంలో ఫరూక్‌ ఇంజినీర్‌ 1973లో ఇంగ్లండ్‌పైనే 121, 66 రన్స్‌ చేశాడు. పంత్‌ టెస్టుల్లో ఇప్పటి వరకూ ఐదు సెంచరీలు చేశాడు.

తదుపరి వ్యాసం