తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pant Takes Dhoni Suggestions: పంత్‌, పాండ్య‌కు ధోనీ బ్యాటింగ్ చిట్కాలు

Pant Takes Dhoni Suggestions: పంత్‌, పాండ్య‌కు ధోనీ బ్యాటింగ్ చిట్కాలు

29 October 2022, 12:19 IST

google News
  • Pant Takes Dhoni Suggestions: టీ20 క్రికెట్‌లో బ్యాటింగ్‌లో రాణించేందుకు టీమ్ ఇండియా క్రికెట‌ర్లు రిష‌బ్ పంత్‌, హార్దిక్ పాండ్య‌లకు ధోనీ కొన్ని విలువైన స‌ల‌హాలు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ధోనీ స‌ల‌హాను పాటించే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య‌ రాణించిన‌ట్లు చెబుతున్నారు.

రిష‌బ్ పంత్‌,
రిష‌బ్ పంత్‌,

రిష‌బ్ పంత్‌,

Pant Takes Dhoni Suggestions: గ‌త కొంత‌కాలంగా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా రాణించ‌డం లేదు టీమ్ ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌. వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటున్నా వాటిని స‌ద్వినియోగం చేసుకోవ‌డం విఫ‌ల‌మ‌వుతున్నాడు. ఫామ్‌లో ఉన్న సంజూశాంస‌న్‌ను కాదని వికెట్ కీప‌ర్‌గా రిష‌బ్ పంత్‌ను వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ఎంపిక‌చేయ‌డంపై బీసీసీఐపై క్రికెట్ అభిమానుల‌తో పాటు విశ్లేష‌కులు విమ‌ర్శలు కురిపించారు. ఇ

ప్ప‌టివ‌ర‌కు వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో టీమ్ ఇండియా రెండు మ్యాచ్‌లు ఆడ‌గా రెండింటిలో రిష‌బ్ పంత్‌కు తుది జ‌ట్టులో స్థానం ద‌క్క‌లేదు. పంత్ స్థానంలో వికెట్ కీప‌ర్‌గా కార్తిక్‌కు ఛాన్స్ వచ్చింది. టీమ్ లో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న పంత్ నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. హిట్టింగ్ చేయ‌డంపై ఎక్కువ‌గా దృష్టిసారిస్తున్నాడు. కాగా ఐపీఎల్‌ త‌ర్వాత త‌న బ్యాటింగ్ తీరును మెరుగుప‌రుచుకునేందుకు రిష‌బ్ పంత్ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ స‌ల‌హాల‌ను కోరిన‌ట్లు తెలిసింది.

ఎక్కువ స‌మ‌యం పాటు క్రీజులో నిల‌దొక్కుకోవ‌డ‌మే కాకుండా హిట్టింగ్ చేయ‌డంలో ధోనీ అత‌డికి విలువైన స‌ల‌హాల‌ను అంద‌జేసిన‌ట్లు చెబుతున్నారు. పంత్‌తో పాటు హార్దిక్ పాండ్య‌కు బ్యాటింగ్‌లో మెళుకువ‌ల‌ను ధోనీ నేర్చించిన‌ట్లు తెలిసింది. టీ20 లో సుల‌భంగా భారీ షాట్స్ కొట్ట‌డం కోసం రౌండ్ బాట‌మ్ బ్యాట్స్ ఉప‌యోగించ‌మ‌ని పంత్‌, హార్దిక్ పాండ్య‌ల‌కు ధోనీ సూచించిన‌ట్లు తెలిసింది.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ధోనీ చెప్పిన స‌ల‌హాను పాండ్య పాటించాడు. రౌండ్ బాట‌మ్ బ్యాట్‌ను తొలిసారి 2019 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ముందు ధోనీ ఉప‌యోగించాడు. అప్ప‌టి నుంచి టీ20 క్రికెట్‌లో రౌండ్ బాట‌మ్ బ్యాట్ల‌కు డిమాండ్ పెరిగిన‌ట్లు చెబుతున్నారు. కాగా ఆదివారం సౌతాఫ్రికాతో టీ20 మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్న‌ది ఇండియా. ఈ మ్యాచ్‌లో కార్తిక్ స్థానంలో రిష‌బ్ పంత్‌కు స్థానం ద‌క్కే అవ‌కాశం ఉన్న‌ట్లు క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

తదుపరి వ్యాసం