తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాంటింగ్, గంగూలీ కొనసాగుతారా? క్లారిటీ ఇచ్చిన ఫ్రాంచైజీ కో-ఓనర్

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాంటింగ్, గంగూలీ కొనసాగుతారా? క్లారిటీ ఇచ్చిన ఫ్రాంచైజీ కో-ఓనర్

15 June 2023, 16:01 IST

google News
    • Delhi Capitals: ఐపీఎల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ కొనసాగుతారా అన్న విషయంపై ఆ ఫ్రాంచైజీ కో-ఓనర్ హింట్ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ (Photo: Delhi Capitals)
రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ (Photo: Delhi Capitals)

రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ (Photo: Delhi Capitals)

Delhi Capitals: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సీజన్‍లో ఆ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ చేయగా.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. సీజన్‍లో ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) హెడ్‍కోచ్‍గా ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‍ను తప్పిస్తారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాంటింగ్‍తో పాటు జట్టుకు క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న భారత లెజెండ్ సౌరవ్ గంగూలీని.. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తీసేస్తుందన్న పుకార్లు బయటికి వచ్చాయి. ఈ నేపథ్యంలో డీసీ ఫ్రాంచైజీ కో-ఓనర్ పార్థ్ జిందాల్.. క్లారిటీ ఇచ్చారు. తర్వాతి సీజన్‍లో పాంటింగ్, గంగూలీ కొనసాగింపు విషయంపై హింట్ ఇచ్చారు.

వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ప్రిపరేషన్స్ మొదలుపెట్టిందని ఆ ఫ్రాంచైజీ కో-ఓనర్ పార్థ్ జిందాల్ ట్వీట్ చేశారు. హెడ్‍కోచ్ రికీ పాంటింగ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీతో సన్నద్ధత మొదలుపెట్టినట్టు పేర్కొన్నారు. ఫ్రాంచైజీని టాప్‍లో ఉంచేందుకు కష్టపడుతున్నామని పార్థ్ జిందాల్ పోస్ట్ చేశారు. దీంతో రూమర్లకు ఈ ట్వీట్‍తో ఆయన చెక్ పెట్టినట్టయింది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‍లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో పాంటింగ్, గంగూలీ కొనసాగుతారని ఆయన ఈ ట్వీట్ తో హింట్ ఇచ్చారు.

కాగా, అసిస్టెంట్ కోచ్‍గా ఉన్న షేన్ వాట్సన్‍ను, ఫాస్ట్ బౌలింగ్ కోచ్‍గా ఉన్న జేమ్స్ హోప్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తప్పించనుందని తెలుస్తోంది. ఇక బ్యాటింగ్ కోచ్‍గా ఉన్న ప్రవీణ్ ఆమ్రే, అసిస్టెంట్ కోచ్ అజిత్ అగార్కర్‌కు ఆ జట్టు మరిన్ని బాధ్యతలు ఇస్తుందని సమాచారం.

ఈ ఏడాది ఐపీఎల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్‍ల్లో కేవలం 4 గెలిచి 8 పాయింట్లను మాత్రమే సాధించింది. పాయింట్స్ టేబుల్‍లో 9వ స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది. కెప్టెన్ రిషబ్ పంత్.. యాక్సిడెంట్ కారణంగా జట్టుకు దూరమవడం తీవ్రమైన ప్రభావం చూపింది. పంత్ గైర్హాజరీలో ఢిల్లీ జట్టుకు కెప్టెన్సీ వహించాడు ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్. కాగా, రిషబ్ పంత్ వచ్చే ఏడాది ఐపీఎల్‍కు అందుబాటులో ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

తదుపరి వ్యాసం