తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravichandran Ashwin | కపిల్‌దేవ్‌ను వెనక్కి నెట్టిన అశ్విన్‌

Ravichandran Ashwin | కపిల్‌దేవ్‌ను వెనక్కి నెట్టిన అశ్విన్‌

Hari Prasad S HT Telugu

06 March 2022, 14:55 IST

google News
    • టీమిండియా ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ రికార్డును బద్ధలుకొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ ఈ రికార్డు సాధించాడు.
టెస్టుల్లో 435 వికెట్లతో కపిల్ దేవ్ ను అధిగమించిన అశ్విన్
టెస్టుల్లో 435 వికెట్లతో కపిల్ దేవ్ ను అధిగమించిన అశ్విన్ (PTI)

టెస్టుల్లో 435 వికెట్లతో కపిల్ దేవ్ ను అధిగమించిన అశ్విన్

మొహాలీ: స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇప్పుడు టీమిండియా తరఫున టెస్టుల్లో రెండో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ను అధిగమించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో అసలంకను ఔట్‌ చేసిన అశ్విన్‌ కెరీర్‌లో 435వ వికెట్‌ను అందుకున్నాడు. ఇన్నాళ్లూ 434 వికెట్లతో అనిల్‌ కుంబ్లే తర్వాత కపిల్‌ దేవ్‌ రెండోస్థానంలో ఉండేవాడు. అయితే అశ్విన్‌ ఇప్పుడు ఆ రికార్డును బద్ధలుకొట్టాడు. కపిల్‌దేవ్‌ 131 టెస్టుల్లో 434 వికెట్లు తీయగా.. అశ్విన్‌ తన 85వ టెస్ట్‌లోనే ఆ రికార్డును అధిగమించడం విశేషం.

ఇక 132 టెస్టుల్లో 619 వికెట్లతో అనిల్‌ కుంబ్లే టాప్‌లో ఉన్నాడు. కపిల్‌ దేవ్‌ తర్వాతి స్థానాల్లో హర్భజన్‌ సింగ్‌ (417), ఇషాంత్‌ శర్మ (311), జహీర్‌ ఖాన్‌ (311) ఉన్నారు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన అశ్విన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. తన 3వ వికెట్‌ తీసినప్పుడే కపిల్‌ రికార్డును అధిగమించాడు. అంతకుముందు బ్యాటింగ్‌లో అశ్విన్‌ రాణించిన విషయం తెలిసిందే. అశ్విన్‌ 61 పరుగులు చేశాడు.

టాపిక్

తదుపరి వ్యాసం