Ind vs SA: ఒక్కో టీమ్‌కు 19 ఓవర్లే.. చివరి టీ20కి వర్షం అడ్డంకి
19 June 2022, 19:46 IST
- ఊహించినట్లే బెంగళూరులో జరుగుతున్న చివరి టీ20కి వర్షం అడ్డుపడుతోంది. టాస్ తర్వాత మ్యాచ్ ప్రారంభానికి కాస్త ముందే వర్షం ప్రారంభమైంది.
చివరి టీ20కి అడ్డుపడిన వర్షం (BCCI Twitter)
చివరి టీ20కి అడ్డుపడిన వర్షం
బెంగళూరు: ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో ఒక్కో టీమ్ 20 ఓవర్లకు బదులు 19 ఓవర్లు మాత్రమే ఆడనుంది. వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. సరిగ్గా ఐదు నిమిషాల ముందు వర్షం ప్రారంభమైంది. భారీ వర్షం కురవడంతో ఔట్‌ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారిపోయింది.
దీంతో మ్యాచ్‌ను 7.50 గంటలకు ప్రారంభించాలని నిర్ణయించారు. రెండు టీమ్స్ ఇన్నింగ్స్‌లో ఒక్కో ఓవర్ కోత విధించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహరాజ్ ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సౌతాఫ్రికా మూడు మార్పులతో బరిలోకి దిగుతుండగా.. ఇండియా ఎలాంటి మార్పుల్లేకుండా ఆడుతోంది.