తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pv Sindhu: ఇండియాలో ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ ఫిమేల్‌ అథ్లెట్‌ సింధు: గోపీచంద్‌

PV Sindhu: ఇండియాలో ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ ఫిమేల్‌ అథ్లెట్‌ సింధు: గోపీచంద్‌

Hari Prasad S HT Telugu

08 August 2022, 18:29 IST

google News
    • PV Sindhu: కామన్వెల్త్‌ గేమ్స్‌లో బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ గోల్డ్‌ మెడల్‌ గెలిచిన పీవీ సింధుపై ప్రశంసలు కురిపించాడు నేషనల్ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌. ఆమె ఇండియాలో ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ ఫిమేల్‌ అథ్లెట్‌ అని అనడం విశేషం.
కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ తో పీవీ సింధు
కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ తో పీవీ సింధు (ANI)

కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ తో పీవీ సింధు

న్యూఢిల్లీ: ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ టీమ్‌ చీఫ్‌ నేషనల్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌.. స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుని ఆకాశానికెత్తాడు. సోమవారం (ఆగస్ట్‌ 8) ఆమె కామన్వెల్త్‌ గేమ్స్‌ సింగిల్స్‌ గోల్డ్‌ మెడల్‌ గెలిచిన తర్వాత అతడు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. భారత గడ్డపై గ్రేటేస్ట్‌ వుమెన్స్‌ అథ్లెట్‌ అని కొనియాడాడు. సింధు వుమెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్లో కెనడాకు చెందిన మిషెలీ లీపై 21-15, 21-13 తేడాతో గెలిచి గోల్డ్‌ మెడల్‌ సాధించిన విషయం తెలిసిందే.

"సింధు కచ్చితంగా గ్రేటెస్ట్‌ ఫిమేల్‌ అథ్లెట్‌. గత పదేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో ఆమె నిలకడగా రాణిస్తోంది. ముఖ్యంగా పెద్ద ఈవెంట్లలో. ఆమె ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు చేసింది. అందులో కామన్వెల్త్‌ గేమ్స్‌ గోల్డ్‌ ప్రత్యేకమైంది. ఓ అథ్లెట్‌గా శారీరకంగా ఆమె చాలా స్ట్రాంగ్‌. కొంతకాలంగా ఆమె స్ట్రోక్‌ ప్లే చాలా మెరుగైంది. ప్రత్యర్థులందరినీ చిత్తు చేస్తోంది. ఆమె స్థాయి మహిళల బ్యాడ్మింటన్‌ ఎవరికీ లేదు" అని గోపీచంద్‌ అనడం విశేషం.

రెండేళ్ల పాటు ఇదే ఫామ్‌ కొనసాగిస్తే.. పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ ఆమె మెడల్‌ గెలవడం పక్కా అని అతను స్పష్టం చేశాడు. ఒకరిద్దరు ప్రత్యర్థులు తప్ప సింధుకి మిగిలిన వాళ్లను ఓడించడం పెద్ద కష్టం కాదని అన్నాడు. "పారిస్‌ గేమ్స్‌కు మరీ ఎక్కువ సమయం లేదు. ఆమె ఇప్పుడున్న ఫామ్‌ను బట్టి గేమ్స్‌ ఫేవరెట్‌ సింధునే. చెన్‌ యూ ఫై లేదా తై జు యింగ్‌లాంటి వాళ్లతోనే ఆమెకు కాస్త కష్టం. కానీ ఓవరాల్‌గా ఆమె ఆడుతున్న తీరు చూస్తుంటే పారిస్‌లో మెడల్‌ రేసులో ముందుంటుంది" అని గోపీచంద్‌ అన్నాడు.

తదుపరి వ్యాసం