తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Anil Kumble: వచ్చే ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు నూతన కోచ్.. తప్పుకోనున్న కుంబ్లే

Anil Kumble: వచ్చే ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు నూతన కోచ్.. తప్పుకోనున్న కుంబ్లే

25 August 2022, 22:20 IST

    • పంజాబ్ కింగ్స్ కోచ్‌ అనిల్ కుంబ్లే కాంట్రాక్టును పొడిగించకుండా అలాగే ఉంచింది పంజాబ్ కింగ్స్. మూడేళ్ల కాంట్రాక్టు ముగియనున్న తరుణంలో అతడి ఒప్పందాన్ని పొడిగించలేదు.
అనిల్ కుంబ్లే
అనిల్ కుంబ్లే (Twitter)

అనిల్ కుంబ్లే

ఇండియన్ ప్రీమియర్ లీగులో పంజాబ్ కింగ్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా అనీల్ కుంబ్లే వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే సీజన్‌ నుంచి ఈ జట్టుకు నూతన కోచ్‌ నియమితులయ్యే అవకాశముంది. ఎందుకంటే అనీల్ కుంబ్లే కాంట్రాక్టు గడువు ముగిసిపోవడమే ఇందుకు కారణం. హెడ్ కోచ్‌గా కుంబ్లేను కొనసాగించనున్నట్లు ఇంత వరకు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకులేదు పంజాబ్. జట్టు నుంచి కుంబ్లేను తొలగించేందుకు ఫ్రాంచైజీ సహా యజమానీ ప్రీతి జీంతా సహా జట్టు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

"కుంబ్లే కాంట్రాక్టు మూడేళ్లు. ఇప్పుడు ఆ గడువు ముగిసింది. ఇది పరస్ఫరం తీసుకున్న నిర్ణయం. అంతేకాకుండా ఆయన కాంట్రాక్టు ముగియడంతో ప్రధాన కోచ్ పదవీలో ప్రత్యామ్నాయాన్ని కనుగొంటాం." అని పంజాబ్ కింగ్స్ జట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఈ దిగ్గజ భారత స్పిన్నర్ పంజాబ్ ప్రధాన కోచ్‌గా 2020లో నియమితుయలయ్యాడు. ఈ మూడేళ్ల కాలంలో ఫ్రాంఛైజీ ఆశించిన ఫలితం పొందలేదు. కుంబ్లే కోచ్‌గా పనిచేసిన మూడేళ్లలో ఒక్కసారి కూడా పంజాబ్ ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేకపోయింది. అతడి హయంలో పంజాబ్ కింగ్స్ 42 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం 18 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలవగలిగింది.

ఇటీవల మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్‌గా భర్తీ చేయనున్నారని పుకార్లను పంజాబ్ జట్టు కొట్టి పారేసింది. అయితే ఇంతలోనే కుంబ్లేను తొలగిస్తున్నట్లు వార్తలు రావడం హాట్ టాపిక్‌గా మారింది. మయాంక్ స్థానంలో బ్రిటీష్ ఆటగాడు బెయిర్‌స్టోను కెప్టెన్‌గా ఎంపిక చేయనున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఆ ఊహాగానాలకు పంజాబ్ కింగ్స్ చెక్ పెట్టింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.

టాపిక్