తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pujara Duck Out In 100th Test: వందో టెస్ట్‌లో పుజారా డ‌కౌట్ - రెండో ఇండియ‌న్ క్రికెట‌ర్‌గా చెత్త రికార్డ్ సొంతం

Pujara Duck Out in 100th Test: వందో టెస్ట్‌లో పుజారా డ‌కౌట్ - రెండో ఇండియ‌న్ క్రికెట‌ర్‌గా చెత్త రికార్డ్ సొంతం

18 February 2023, 13:00 IST

google News
  • Pujara Duck Out in 100th Test: ఢిల్లీ టెస్ట్‌తో కెరీర్‌లో వంద టెస్ట్‌ల మైలురాయిని చేరుకున్న టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్‌ పుజారా చెత్త రికార్డ్‌ను మూట‌గ‌ట్టుకున్నాడు. వందో టెస్ట్‌లో డ‌కౌటైన రెండో ఇండియ‌న్ క్రికెట‌ర్‌గా నిలిచాడు.

సునీల్ గ‌వాస్క‌ర్‌, పుజారా
సునీల్ గ‌వాస్క‌ర్‌, పుజారా

సునీల్ గ‌వాస్క‌ర్‌, పుజారా

Pujara Duck Out in 100th Test: ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాతో జ‌రుగుతోన్న రెండో టెస్ట్‌ ద్వారా వంద టెస్ట్‌ల మైలురాయిని చేరుకున్న ఇండియ‌న్ క్రికెట‌ర్‌గా పుజారా రికార్డ్ క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో పుజారా డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ శ‌ర్మ ఔటైన త‌ర్వాత బ్యాటింగ్ దిగిన పుజారా కేవ‌లం ఏడు బాల్స్ మాత్ర‌మే ఎదుర్కొని నాథ‌న్ ల‌య‌న్ బౌలింగ్‌లో డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

వందో టెస్ట్‌లో సున్నా ప‌రుగుల‌కు ఔటైన రెండో ఇండియ‌న్ క్రికెట‌ర్‌గా చెత్త రికార్డును మూట గ‌ట్టుకున్నాడు. గ‌తంలో దిలీప్ వెంగ్‌స‌ర్కార్ వందో టెస్ట్‌లో డ‌కౌట్ అయ్యాడు. ప్ర‌పంచ క్రికెట్‌లో వెంగ్ స‌ర్కార్‌తో పాటు బోర్డ‌ర్‌, మార్క్ టేల‌ర్‌, స్టిఫెన్ ఫ్లేమింగ్‌, అలిస్ట‌ర్ కుక్‌, బ్రెండ‌న్ మెక్ క‌ల‌మ్ వందో టెస్ట్‌లో డ‌కౌట్ అయ్యారు. ఢిల్లీ టెస్ట్‌తో ఈ జాబితాలో పుజారా చేరాడు. ఈ మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న రెండో బంతికే పుజారా ఔట్ అయ్యాడు. కానీ ఆ ఎల్‌బీడ‌బ్ల్యూను అంపైర్ నాటౌట్‌గా పేర్కొన్నాడు.

20 ప‌రుగుల‌తో రెండో రోజును ఆట‌ను ప్రారంభించిన టీమ్ ఇండియా తొలి సెష‌న్‌లో వ‌రుస‌గా నాలుగు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శ‌ర్మ 32 ప‌రుగులు చేసి ఔట్ కాగా మ‌రోసారి పేల‌వ ఫామ్‌ను కొన‌సాగించిన రాహుల్ 17 ప‌రుగుల‌కు పెవిలియ‌న్ చేరుకున్నాడు.

సూర్య‌కుమార్ స్థానంలో రెండో టెస్ట్‌లోకి వ‌చ్చిన అయ్య‌ర్ 4 ర‌న్స్ చేసి నిరాశ‌ప‌రిచాడు. ప్ర‌స్తుతం విరాట్ కోహ్లి 23 ర‌న్స్‌, జ‌డేజా 25 ర‌న్స్‌తో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం టీమ్ ఇండియా 43 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 111 ప‌రుగులు చేసింది . టీమ్ ఇండియా కోల్పోయిన నాలుగు వికెట్లు నాథ‌న్ ల‌య‌న్‌కు ద‌క్క‌డం గ‌మ‌నార్హం.

తదుపరి వ్యాసం