తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Fir Against Vinod Kambli: టీమ్ ఇండియా మాజీ క్రికెట‌ర్ వినోద్ కాంబ్లిపై కేసు న‌మోదు - కార‌ణం ఇదే

Fir Against Vinod Kambli: టీమ్ ఇండియా మాజీ క్రికెట‌ర్ వినోద్ కాంబ్లిపై కేసు న‌మోదు - కార‌ణం ఇదే

05 February 2023, 13:52 IST

google News
  • Fir Against Vinod Kambli: టీమ్ ఇండియా మాజీ క్రికెట‌ర్ వినోద్ కాంబ్లి చిక్కుల్లో ప‌డ్డాడు. భార్యాపిల్ల‌ల‌పై దాడికి పాల్ప‌డినందుకు ముంబాయి పోలీసులు అత‌డిపై కేసును న‌మోదు చేశారు.

వినోద్ కాంబ్లి
వినోద్ కాంబ్లి

వినోద్ కాంబ్లి

Fir Against Vinod Kambli: టీమ్ ఇండియా మాజీ క్రికెట‌ర్ వినోద్ కాంబ్లిపై ముంబాయి పోలీసులు కేసు న‌మోదు చేశారు. భ‌ర్త కాంబ్లి త‌న‌పై దాడి చేశాడంటూ అత‌డి భార్య ఆండ్రియా బాంద్రా పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

మ‌ద్యం మ‌త్తులో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం కాంబ్లి భార్య‌తో పాటు ఇద్ద‌రు కుమారుల‌పై దాడికి పాల్ప‌డిన‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్న‌ట్లు తెలిసింది. కుకింగ్ ప్యాన్ హ్యాండిల్‌ను భార్య‌పై బ‌లంగా విస‌ర‌డంతో ఆమె త‌ల‌కు గాయ‌మైన‌ట్లు పోలీసులు తెలిపారు.

బ్యాట్‌తో భార్యా పిల్ల‌ల‌పై కాంబ్లి దాడిచేయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిసింది. భార్యాకుమారుల‌పై దాడిచేసిన కాంబ్లిపై పోలీసులు ఐపీసీ సెక్ష‌న్ 324, 504 ఆధారంగా కేసును న‌మోదు చేసిన‌ట్లు సమాచారం.

ప్ర‌స్తుతం దాడికి గ‌ల కార‌ణాల్ని పోలీసులు విచారిస్తోన్న‌ట్లు తెలిసింది. కాంబ్లిని అరెస్ట్ చేయ‌లేద‌ని స‌మాచారం. కాంబ్లి భార్య ఆండ్రియా భాభా హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌తంలో త‌న అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌తో ప‌లుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు కాంబ్లి. టీమ్ ఇండియా త‌ర‌ఫున 17టెస్ట్‌లు ఆడిన కాంబ్లి 1084 ర‌న్స్ చేశాడు. 104 వ‌న్డేల్లో 2477 ప‌రుగులు సాధించాడు.

టాపిక్

తదుపరి వ్యాసం