Rishabh Pant: పుజారా సలహాల వల్లే సెంచరీ చేయలేకపోయానన్న పంత్...
17 June 2022, 10:30 IST
- 2020 21 లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్ ను 2 1 తేడాతో ఇండియా సొంతం చేసుకున్నది. ఈ సిరీస్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. సిడ్నీ టెస్ట్ లో సెంచరీ చేజార్చుకున్న సంఘటనపై బంధన్ మే థా దమ్ డాక్యుమెంటరీ సిరీస్ పంత్ స్పందించాడు.
రిషబ్ పంత్
2020 21 లో జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్ ను ఇండియా 2 1 తేడాతో గెలుచుకున్నది. ఈ సిరీస్ లో పంత్ బ్యాటింగ్ లో చక్కగా రాణించాడు. ముఖ్యంగా సిడ్నీ లో జరిగిన మూడో టెస్ట్ లో ఓటమి దిశగా ప్రయాణిస్తున్న ఇండియాను మెరుపు బ్యాటింగ్ తో ఆదుకున్నాడు. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో వన్డే తరహాలో చెలరేగిన పంత్ 118 బంతుల్లోనే 97 పరుగులు చేసి ఔటయ్యాడు. మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. సెంచరీ చేజారిపోవడానికి గల కారణాల్ని బంధన్ మే థా ధమ్ డాక్యుమెంటరీ సిరీస్ లో రిషబ్ పంత్ వెల్లడించారు.
ఆ మ్యాచ్ లో తాను బ్యాటింగ్ దిగుతున్నప్పుడే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నానని పంత్ అన్నాడు. కానీ సెంచరీకి చేరువ అవుతున్న సమయంలో పుజారా క్రీజులో నిలదొక్కుకోవాలంటే సింగల్, డబుల్స్ మీద దృష్టిపెట్టమని పదే పదే సలహాలు ఇచ్చాడని పంత్ పేర్కొన్నాడు. ఫోర్లు కొట్టాలని ప్రయత్నించకుండా నిదానంగా ఆడమని సూచించాడని తెలిపాడు. తన ప్లాన్ కు భిన్నంగా ఆడమని పుజారా సలహా ఇవ్వడం తనకు కోపాన్ని తెప్పించిందని పంత్ పేర్కొన్నాడు. అతడి మాటలతో ఏకాగ్రత కోల్పోయి తాను ఔట్ అయినట్లు చెప్పాడు.
సెంచరీకి చేరువ అయ్యావని అతడు గుర్తుచేయడం కూడా ఔట్ కావడానికి ఓ కారణమని నిలిచిందని అన్నాడు. అతడు ఆ మాట చెప్పి ఉండకపోయుంటే దూకుడుగా ఆడుండేవాడినని పంత్ అన్నాడు. సెంచరీ పూర్తి చేసుంటే ఆ మ్యాచ్ ఎప్పటికీ తన కెరీర్ లో గుర్తుండిపోయేదని పంత్ అన్నాడు. ఈ సంఘటనపై ఆ మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరించిన రహానే కూడా ఈ డాక్యుమెంటరీలో స్పందించాడు.
97 వద్ద ఔట్ అయి డ్రెస్పింగ్ రూమ్ కు చేరుకున్న పంత్ చాలా కోపంగా కనిపించాడని రహానే అన్నాడు. అతడి దగ్గరకు వెళ్లి ఏం జరిగిందో తెలుసుకొని కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశానని అన్నాడు. తన అనుభవంతో పుజారా చెప్పిన మాటలను పంత్ పాటిస్తే బాగుండేదని రహానే అన్నాడు. కానీ పంత్ అలా చేయలేకపోయాడని, తొందరపాటుతో ఔట్ అయ్యాడని రహానే పేర్కొన్నాడు.
టాపిక్