తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pakistan Cricketers Praise On Virat Kohli: కోహ్లిపై పాక్ క్రికెట‌ర్ల ప్ర‌శంస‌లు - ట్వీట్స్ వైర‌ల్‌

Pakistan Cricketers Praise on Virat kohli: కోహ్లిపై పాక్ క్రికెట‌ర్ల ప్ర‌శంస‌లు - ట్వీట్స్ వైర‌ల్‌

24 October 2022, 10:02 IST

google News
  • Pakistan Cricketers Praise on Virat kohli: ఆదివారం పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సూప‌ర్ ఇన్నింగ్స్‌తో టీమ్ ఇండియాను గెలిపించాడు విరాట్ కోహ్లి. అత‌డిపై ప్ర‌శంస‌ల వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ క్రికెట‌ర్స్ కూడా విరాట్ కోహ్లిని ప్ర‌శంసిస్తూ ట్వీట్స్ చేశారు.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి

Pakistan Cricketers Praise on Virat kohli: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా అద్భుత విజ‌యాన్ని సొంతం చేసుకున్న‌ది. 30 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి ఓట‌మి దిశ‌గా సాగిన టీమ్ ఇండియా ను విరాట్ కోహ్లి సంచ‌ల‌న ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. 53 బాల్స్‌లో నాలుగు సిక్స‌ర్లు, ఆరు ఫోర్ల‌తో 82 ర‌న్స్ చేశాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. గ‌త కొన్నేళ్లుగా పేల‌వ ఫామ్‌తో ఇబ్బందులు ప‌డుతోన్న అత‌డు సూప‌ర్ ఇన్నింగ్స్‌తో విమ‌ర్శ‌ల‌న్నింటిని తుడిచిపెట్టాడు.

విరాట్ కోహ్లిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు అభిమానులు విరాట్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. పాకిస్థాన్ క్రికెట‌ర్లు కూడా విరాట్‌ను అభినందిస్తూ సోష‌ల్ మీడియాలో ట్వీట్స్ చేశారు. స్పెష‌ల్ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌కు స్పెష‌ల్ ప్లేయ‌ర్‌గా నిలిచాడ‌ని మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్ ట్వీట్ చేశాడు. గెలుపు ఓట‌ములు ఆట‌లో స‌హ‌జం అని వ‌హాబ్ రియాజ్ పేర్కొన్నాడు. రెండు టీమ్‌లో చ‌క్క‌టి ఆట‌తీరును క‌న‌బ‌రిచాయ‌ని, బెస్ట్ టీమ్ ఈ మ్యాచ్‌లో గెలిచింద‌ని వ‌హాబ్ రియాజ్ అన్నాడు.

గేమ్‌ను ఎలా ఫినిష్ చేయాలో కోహ్లికి తెలిసినంత‌గా ఎవ‌రికి తెలియ‌ద‌ని షోయ‌బ్ మాలిక్ అన్నాడు. అత‌డి క్లాస్ గేమ్‌తో పోటీప‌డే ప్లేయ‌ర్స్ వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో ఎవ‌రూ లేర‌ని అన్నాడు. పాకిస్థాన్ మాజీ దిగ్గ‌జ క్రికెట‌ర్ వ‌సీం అక్ర‌మ్ కోహ్లిని స‌ర‌దాగా ఎలియ‌న్ అని పేర్కొన్నాడు.

ఇటీవ‌ల కాలంలో తాను చూసిన గొప్ప ఇన్నింగ్స్‌ల‌లో ఇది ఒక‌ట‌ని అన్నాడు. ఛేజింగ్‌లో అత‌డి యావ‌రేజ్ అద్భుత‌మ‌ని ప్ర‌శంస‌లు కురిపించాడు. పాకిస్థాన్ ప్లేయ‌ర్స్ చేసిన ట్వీట్స్ క్రికెట్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

తదుపరి వ్యాసం