తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ross Taylor: రాస్ టేలర్‌పై రాజస్థాన్ ఓనర్ దాడి.. బుక్‌లో కివీ ప్లేయర్ ప్రస్తావన

Ross Taylor: రాస్ టేలర్‌పై రాజస్థాన్ ఓనర్ దాడి.. బుక్‌లో కివీ ప్లేయర్ ప్రస్తావన

13 August 2022, 21:01 IST

google News
    • న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్.. ఐపీఎల్ జట్లలో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ జట్టు యజమానిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆర్ఆర్ ఓనర్ తనను కొట్టాడని స్పష్టం చేశాడు.
రాస్ టేలర్
రాస్ టేలర్ (Instagram)

రాస్ టేలర్

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ తన జీవిత చరిత్ర ఆధారంగా ఓ బుక్ రాసిన విషయం తెలిసిందే. బ్లాక్ అండ్ వైట్ అనే ఈ పుస్తకాన్ని ఈ వారం ప్రారంభంలోనే ఆవిష్కరించారు. ఇందులో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘనటలు, విషయాలను పంచుకున్నారు. అయితే తన పుస్తకంలో కొన్ని షాకింగ్ విషయాలను కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఆడేటప్పుడు ఒకానొక సందర్భంలో రాజస్థాన్ రాయల్స్ యజమాని ఒకరు తనను చెంపపై కొట్టారనే ఆశ్చర్యకర విషయాన్ని తెలియజేశారు. తాను డకౌటై పెవిలియన్ చేరడంతో చెంపపై దాడి చేశారని స్పష్టం చేశారు.

"మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్(పంజాబ్ కింగ్స్)తో మ్యాచ్ జరుగుతోంది. లక్ష్యం వచ్చేసి 195 పరుగులు. ఆ సమయంలో నేను ఎల్బీడబ్ల్యూగా డకౌటై పెవిలియన్ చేరాను. మేను కనీసం లక్ష్యానికి దగ్గర్లో కూడా రాలేకపోయాం. మ్యాచ్ అనంతరం టీమ్ సపోర్ట్ స్టాఫ్, మేనేజ్మెంట్ హోటెల్‌పైన ఉన్న బార్‌లో ఉన్నాం. వార్నర్‌తో పాటు లిజ్ హార్లీ కూడా అక్కడ ఉన్నారు. ఆ సమయంలో రాజస్థాన్ రాయల్స్ యజమానుల్లో ఒకరు నా వద్దకు వచ్చి రాస్ నువ్వు డకౌట్ అవ్వడానికి కాదు మేము నీకు ఒక మిలియన్ డాలర్లను ఇచ్చేది అంటూ చెంపపై మూడు, నాలుగు సార్లు కొట్టారు." అని రాస్ టేలర్ తన పుస్తకంలో ప్రస్తావించాడు. అయితే అనంతరం ప్రాంక్ మాదిరిగా నవ్వుతూ వెళ్లిపోయాడని తెలిపారు రాస్.

"చెంపపై మూడు, నాలుగు సార్లు కొట్టేసి నవ్వుతూ అక్కడ నుంచి అతడు జారుకున్నాడు. కానీ నాకు తెలిసినంత వరకు అది నటన అని నాకు అనిపించలేదు. కావాలనే కొట్టినట్లు అనిపించింది. పరిస్థితుల ప్రభావం వల్ల ఆ విషయాన్ని అప్పుడు పెద్దది చేయలేదు. కానీ ఇతర స్పోర్టింగ్ ఎన్విరాన్మెంట్‌లో ఇలాంటివి జరుగుతాయని ఊహించలేకున్నాను." అని ఈ కివీస్ దిగ్గజం తన పుస్తకంలో రాసుకొచ్చాడు.

రాస్ టేలర్ 2008 నుంచి 2010 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. 2011లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం డిల్లీ డేర్ డేవిల్స్, పుణె వారియర్స్ జట్టు తరఫున ఆడాడు.

టాపిక్

తదుపరి వ్యాసం