South Africa vs Netherlands:సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ షాక్ - సెమీ ఫైనల్‌లోకి ఇండియా
06 November 2022, 9:37 IST
South Africa vs Netherlands: సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ గట్టి షాక్ ఇచ్చింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ నిరాశపరిచారు. నెదర్లాండ్స్ చేతిలో 13 పరుగులు తేడాతో ఓటమి పాలైన సౌతాఫ్రికా వరల్డ్ కప్ నుంచి ఔట్ అయ్యింది. సౌతాఫ్రికా ఓటమితో ఇండియా సెమీస్ బెర్త్ ఖాయమైంది.
నెదర్లాండ్స్ టీమ్
South Africa vs Netherlands: టీ20 వరల్డ్ కప్ నుంచి సౌతాఫ్రికా నిష్క్రమించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు పసికూన నెదర్లాండ్స్ షాక్ ఇచ్చింది. 13 పరుగులు తేడాతో సౌతాఫ్రికాపై విజయాన్ని అందుకున్నది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ ఇరవై ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 రన్స్ చేసింది. అకెర్‌మన్ 41, మై బర్గ్ 37, టామ్ కూపర్ 35 రన్స్‌తో రాణించారు.
సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు తీశాడు. అతడు మినహా మిగిలిన వారు వికెట్లు తీయలేకపోయారు. లక్ష్యఛేదనలో తడబడిన సౌతాఫ్రికా ఇరవై ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి కేవలం 145 రన్స్ మాత్రమే చేసింది. ఓపెనర్లు డికాక్, బవుమా నిదానంగా ఆడటం సౌతాఫ్రికాను దెబ్బతీసింది.
రూసో, మార్‌క్రమ్ ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన వారు తొందరగానే ఔట్ కావడంతో సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. మిల్లర్, క్లాసెన్, పార్నెల్ ఎవరూ కూడా బ్యాట్ ఝులిపించలేకపోవడంతో సౌతాఫ్రికా 13 రన్స్‌తో ఓటమి పాలైంది. రూసో 25 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్ గ్లోవర్ సౌతాఫ్రికాను కట్టడిచేశాడు. రెండు ఓవర్లలో 9 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. క్లాసెన్, డెలీడ్ తలో రెండు వికెట్లు తీశారు.
ఇండియా సెమీస్‌కు
నెదర్లాండ్స్‌పై సౌతాఫ్రికా ఓడిపోవడంతో ఇండియా సెమీస్ చేరుకుంది. జింబాబ్వే మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇండియా సెమీస్ బెర్త్ ఖాయమైంది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే సెమీస్ చేరేది. కానీ కీలక మ్యాచ్‌లో ఓటమి పాలై వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ 2 నుంచి సెమీస్ చేరే రెండో జట్టు ఏదన్నది బంగ్లాదేశ్ పాకిస్థాన్ మ్యాచ్‌పై ఆధారపడి ఉంది. ఇందులో గెలిచిన జట్టు సెమీ ఫైనల్ చేరుతుంది. టీమ్