Neeraj Chopra: వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నీరజ్ చోప్రా నామినేట్ - ఫస్ట్ ఇండియన్ అతడే
13 October 2023, 13:34 IST
Neeraj Chopra: మెన్స్ వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డుకు ఇండియన్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా నామినేట్ అయ్యాడు. ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి ఇండియన్ అథ్లెట్‌గా రికార్డ్ సృష్టించాడు.
నీరజ్ చోప్రా
Neeraj Chopra: ఇండియన్ స్టార్ అథ్లెట్, జావెలిన్ థ్రో ప్లేయర్ నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మెన్స్ వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డుకు నామినేట్ అయ్యాడు. అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి ఇండియన్ ఆటగాడిగా నీరజ్ చోప్రా నిలిచాడు. ఈ జాబితాతో నీరజ్ చోప్రాతో పాటు వివిధ దేశాలకు చెందిన పది మంది అథ్లెట్స్ నామినేట్ అయ్యారు.
వారిలో అమెరికన్ స్ప్రింటర్ నోహా లైస్, స్టిపుల్ ఛేజ్ ఒలింపిక్ విన్నర్ సోషియన్ ఎలా బక్కాలి, మండో డుప్లాంటిస్, అల్వరో మార్టిన్ తదితరులు ఉన్నారు. వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు ఎవరు సొంతం చేసుకుంటారన్నది డిసెంబర్ 11న తేలనుంది. వరల్డ్ అథ్లెటిక్ కౌన్సిల్ జ్యూరీ మెంబర్స్ తో పాటు వరల్డ్ అథ్లెటిక్ ఫ్యామిలీ మెంబర్స్, క్రీడాభిమానులు ఈ ఓటింగ్‌లో పాలుపంచుకునే అవకాశం ఉంది. అత్యధిక ఓట్లు ఎవరికి వస్తే వారే విన్నర్‌గా నిలుస్తారు.
జపాన్ వేదికగా జరిగిన ఒలింపిక్ క్రీడల్లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిచాడు. బుడాపెస్ట్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్‌తో పాటు డైమండ్ లీగ్ 2023తో విన్నర్‌గా నిలిచి నీరజ్ చోప్రా చరిత్రను సృష్టించాడు. ఇటీవల జరిగిన ఎషియన్ క్రీడల్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు.
టాపిక్