తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Neeraj Chopra: భారతీయులను నిరాశ పరిచిన నీరజ్ చోప్రా.. కొద్ది తేడాతో విఫలం

Neeraj Chopra: భారతీయులను నిరాశ పరిచిన నీరజ్ చోప్రా.. కొద్ది తేడాతో విఫలం

Sanjiv Kumar HT Telugu

17 September 2023, 11:25 IST

google News
  • Neeraj Chopra : ఇండియన్ జావెలిన్ త్రో హీరో నీరజ్ చోప్రా ఇటీవల ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‍షిప్‍లో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నీరజ్ చోప్రా డైమండ్ లీగ్‍లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

భారతీయులను నిరాశ పరిచిన నీరజ్ చోప్రా.. కొద్ది తేడాతో విఫలం
భారతీయులను నిరాశ పరిచిన నీరజ్ చోప్రా.. కొద్ది తేడాతో విఫలం

భారతీయులను నిరాశ పరిచిన నీరజ్ చోప్రా.. కొద్ది తేడాతో విఫలం

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‍షిప్‍లో (World Athletics Championships) స్వర్ణం సాధించి కోట్లాది భారతీయుల మనసు గెలుచుకున్న నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‍లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. డైమండ్ లీగ్ 2023 (2023 Diamond League)ఫైనల్ సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి జరిగింది. అంటే భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 17న తెల్లవారు జామున 1.50 గంటలకు ఫైనల్ ప్రసారం అయింది. ఇందుకు అమెరికాలోని యూజీన్ నగరం వేదిక అయింది.

డైమండ్ లీగ్ 2023 ఫైనల్‍లో చెక్ రిపబ్లిక్ ఆటగాడు జాకబ్ వాద్లెజ్ ఛాంపియన్‍గా నిలిచాడు. ఫైనల్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్‍ను 83.80 మీటర్లు విసిరి రెండో స్థానం సంపాదించుకున్నాడు. మొదటి, నాలుగో ప్రయత్నాల్లో విఫలమైన నీరజ్ చోప్రా.. రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. మూడు, ఐదు, ఆరు ప్రయత్నాల్లో వరుసగా 81.37, 80.74, 80.90 మీటర్ల దూరంలో జావెలిన్‍ను త్రో చేశాడు నీరజ్ చోప్రా. ఇక చెక్ రిపబ్లిక్ ప్లేయర్ జాకబ్ వాద్లెచ్ తన ఆఖరు ప్రయత్నంలో 84.24 మీటర్ల దూరంలో ఈటెను విసిరి అత్యుత్తమ త్రోను నమోదు చేశాడు.

ఇదే డైమండ్ లీగ్ 2023 ఫైనల్‍లో ఫిన్లాండ్‍కు చెందిన ఆలివర్ హెలాండర్ 80.90 మీటర్ల దూరంలో జావెలిన్ విసిరి మూడో స్థానం దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సీజన్‍లో మంచి ఫామ్‍లో ఉన్న నీరజ్ చోప్రా మరోసారి విజేతగా నిలుస్తాడని అభిమానులు, భారతీయులు భావించారు. కానీ, 0.44 మీటర్ల అతి కొంత తేడాతో గెలుపు మరొకరి వశం అయింది. దీంతో భారతీయులు నిరాశ చెందారు. కాగా.. గతేడాది జ్యూరిచ్‍లో జరిగిన డైమండ్ లీగ్‍లో 25 ఏళ్ల నీరజ్ చోప్రా టైటిల్ కొట్టిన విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం