తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rashid Khan | అతన్ని అందుకే రిటేన్‌ చేసుకోలేదు: సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ కోచ్‌ మురళీధరన్‌

Rashid Khan | అతన్ని అందుకే రిటేన్‌ చేసుకోలేదు: సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ కోచ్‌ మురళీధరన్‌

HT Telugu Desk HT Telugu

13 April 2022, 17:12 IST

google News
    • రషీద్‌ ఖాన్‌.. ఆఫ్ఘనిస్థాన్‌లాంటి దేశం నుంచి వచ్చిన ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న క్రికెటర్‌. ఐపీఎల్‌తో అతని రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది.
గుజరాత్ టైటన్స్ బౌలర్ రషీద్ ఖాన్
గుజరాత్ టైటన్స్ బౌలర్ రషీద్ ఖాన్ (ANI)

గుజరాత్ టైటన్స్ బౌలర్ రషీద్ ఖాన్

ముంబై: ఐపీఎల్‌ ఎంతో మంది స్టార్‌ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇందులో దేశవిదేశాలకు చెందిన ప్లేయర్స్‌ ఉన్నారు. అందులో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన రషీద్‌ ఖాన్‌ కూడా ఒకడు. తన సొంత దేశం కంటే ఐపీఎల్లే అతనికి ఎక్కువ పేరు తెచ్చి పెట్టింది. లెగ్‌ స్పిన్‌ మాయాజాలంతో స్టార్‌ బ్యాటర్లను కూడా బోల్తా కొట్టించే సత్తా రషీద్‌ ఖాన్‌ సొంతం. అలాంటి రషీద్‌ ఖాన్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఎన్నో మ్యాచ్‌ విన్నింగ్‌ బౌలింగ్‌ స్పెల్స్‌ వేశాడు.

అయినా గతేడాది రషీద్‌ను ఆ టీమ్‌ రిటేన్‌ చేసుకోలేదు. దీనిపై ఎంతో మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతటి స్టార్‌ ప్లేయర్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ లైట్‌ తీసుకోవడంపై అభిమానులు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే అతన్ని ఎందుకు రిటేన్‌ చేసుకోలేకపోయామో తాజాగా గుజరాత్‌, హైదరాబాద్‌ మ్యాచ్‌ సందర్భంగా సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ కోచ్‌ మురళీధరన్‌ చెప్పాడు.

"మేము అతన్ని వదులుకోవాలని అనుకోలేదు. కానీ అతనికి భారీ మొత్తం చెల్లించే పరిస్థితుల్లో లేము" అని మురళీధరన్‌ చెప్పాడు. రషీద్‌ఖాన్‌తోపాటు డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టోలాంటి ప్లేయర్స్‌ను కూడా సన్‌రైజర్స్‌ వదిలేసిన విషయం తెలిసిందే. 2017లో రషీద్‌ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసిన ఆశ్చర్యపరిచింది సన్‌రైజర్స్‌ టీమ్‌. అయితే అతడు ఆ టీమ్‌ పెట్టుకున్న ఆశలను వమ్ము చేయలేదు. తొలి సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో 17 వికెట్లు తీశాడు. మొత్తంగా ఐదు సీజన్ల పాటు ఆ ఫ్రాంఛైజీకి ఆడిన రషీద్‌.. 76 మ్యాచ్‌లలో 93 వికెట్లు తీయడం విశేషం.

సన్‌రైజర్స్‌ అతన్ని వదిలేయడంతో కొత్త టీమ్‌ గుజరాత్‌ టైటన్స్‌ వేలం కంటే ముందే అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఆ టీమ్‌ తరఫున అతడు 4 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీసుకున్నాడు.

టాపిక్

తదుపరి వ్యాసం