తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Australia T20i Series: భారత్‌తో సిరీస్‌కు ముందు ఆసీస్‌కు ఎదురుదెబ్బ.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లు దూరం

India vs Australia T20I Series: భారత్‌తో సిరీస్‌కు ముందు ఆసీస్‌కు ఎదురుదెబ్బ.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లు దూరం

14 September 2022, 13:49 IST

google News
    • India vs Australia T20I Series 2022: భారత్‌తో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ముగ్గురు గాయ పడ్డారు. ఫలితంగా ఈ టీ20 సిరీస్‌కు దూరం కానున్నారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
మిషెల్ స్టార్క్
మిషెల్ స్టార్క్ (AFP)

మిషెల్ స్టార్క్

Australia Players with Injuries ruled out T20I series: వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే వరుస పెట్టి టీ20 సిరీస్‌లు ఆడుతోంది కంగారూ జట్టు. ఈ నెల 20 నుంచి టీమిండియాతో మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు గానూ భారత్‌లో పర్యటించనుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. ఆ జట్టులోని ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరం కానున్నారు. మిషెల్ మార్ష్, మిషెల్ స్టార్క్, మార్కస్ స్టాయినీస్ గాయం కారణంగా భారత్‌లో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు దూరం కానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

స్టార్క్ మోకాలి గాయంతో బాధపడుతుంటగా.. మిషెల్ మార్ష్, స్టాయినీస్ చీలమండ, పక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణంగా ఈ ముగ్గురు టీమిండియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరమయ్యారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గాయాలు చిన్నవే అయినప్పటికీ వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్ జరగనున్న సందర్భంగా రిస్క్ తీసుకోదలచుకోలేదని, అందుకనే వారిని సిరీస్‌కు విశ్రాంతి కల్పించినట్లు స్పష్టం చేసింది.

గాయపడిన ఈ ముగ్గురు ఆటగాళ్ల స్థానంలో నాథన్ ఇల్లీస్, డేనియల్ సామ్స్, సీన్ అబాట్‌కు అవకాశం కల్పించింది. టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు విశ్రాంతి కల్పించగా.. తాజాగా ముగ్గురు ఆటగాళ్లు గాయాల బెడదతో సిరీస్‌కు దూరం కావడం గమనార్హం. మిషెల్ మార్ష్, స్టాయినీస్ జింబాబ్వేతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్ నుంచే గాయాల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. స్టార్క్‌ను బుధవారం వైద్య బృందం అతడి మోకాలికి నిర్వహించిన స్కాన్ ఆధారంగా విశ్రాంతి కల్పించారు.

ఆస్ట్రేలియా.. భారత్‌తో మూడు టీ20 సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ సెప్టెంబరు 20న మొహాలీ వేదికగా జరగనుండగా.. రెండో టీ20 నాగపూర్‌లో నిర్వహించనున్నారు. మూడో మ్యాచ్ హైదరాబాద్ వేదికగా సెప్టెంబరు 25న జరపనున్నారు. టీమిండియాతో పొట్టి సిరీస్ తర్వాత టీ20 ప్రపంచకప్‌నకు ముందు వెస్టిండీస్‌, ఇంగ్లాండ్ దేశాలతో కంగారూ జట్టు ఆడనుంది.

టాపిక్

తదుపరి వ్యాసం