తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dc Vs Pbks | మిచెల్‌ మార్ష్‌ హాఫ్‌ సెంచరీ.. పంజాబ్‌ టార్గెట్‌ చేజ్‌ చేస్తుందా?

DC vs PBKS | మిచెల్‌ మార్ష్‌ హాఫ్‌ సెంచరీ.. పంజాబ్‌ టార్గెట్‌ చేజ్‌ చేస్తుందా?

Hari Prasad S HT Telugu

16 May 2022, 21:12 IST

google News
    • లియామ్‌ లివింగ్‌స్టోన్‌ తన పార్ట్‌టైమ్‌ స్పిన్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ను దెబ్బతీయగా.. మిచెల్‌ మార్ష్‌ హాఫ్‌ సెంచరీతో తన టీమ్‌కు మంచి స్కోరు సాధించి పెట్టాడు. ఇక పంజాబ్‌ కింగ్స్‌ టార్గెట్‌ను చేజ్‌ చేస్తుందో లేదో చూడాలి.
ఢిల్లీని దెబ్బతీసిన లియామ్ లివింగ్ స్టోన్
ఢిల్లీని దెబ్బతీసిన లియామ్ లివింగ్ స్టోన్ (PTI)

ఢిల్లీని దెబ్బతీసిన లియామ్ లివింగ్ స్టోన్

ముంబై: మిచెల్‌ మార్ష్‌ ఫైటింగ్‌ హాఫ్‌ సెంచరీతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 రన్స్‌ చేసింది. లివింగ్‌స్టోన్‌ 3 వికెట్లతో ఢిల్లీని దెబ్బతీసినా.. మార్ష్‌ ఆదుకున్నాడు. చివరికి అతడు 48 బాల్స్‌లోనే 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63 రన్స్‌ చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మరో బౌలర్‌ రాహుల్‌ చహర్‌ వికెట్ తీయకపోయినా 4 ఓవర్లలో కేవలం 19 రన్స్‌ ఇచ్చి ఢిల్లీని కట్టడి చేశాడు. అటు అర్ష్‌దీప్‌ కూడా 3 వికెట్లు తీశాడు. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి బంతికే షాక్‌ తగిలింది. ఆ టీమ్‌ స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గోల్డెన్‌ డకౌటయ్యాడు. పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ లివింగ్‌స్టోన్‌తో బౌలింగ్‌ ప్రారంభించాలన్న మయాంక్‌ అగర్వాల్ ఎత్తుగడ ఫలించింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్‌ మార్ష్‌.. మరో ఓపెనర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌తో కలిసి పంజాబ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. బౌండరీలు బాదడమే పనిగా పెట్టుకున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ 16 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 32 రన్స్‌ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే లలిత్‌ యాదవ్‌ కూడా బౌండరీ దగ్గర బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చినా.. అది నోబాల్‌ కావడంతో బతికిపోయాడు. ఆ తర్వాత మార్ష్‌తో కలిసి మూడో వికెట్‌కు 47 రన్స్ జోడించిన తర్వాత 24 రన్స్‌ చేసి ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌ (7), రోవ్‌మన్‌ పావెల్‌ (2) విఫలమయ్యారు. దీంతో మిడిల్ ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ అనుకున్న స్థాయిలో స్కోరు చేయలేకపోయింది.

టాపిక్

తదుపరి వ్యాసం