తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Major League Cricket 2023: సునీల్ న‌రైన్ టీమ్ ఘోర ప‌రాజ‌యం - యాభై ర‌న్స్‌కే ఆలౌట్‌

Major League Cricket 2023: సునీల్ న‌రైన్ టీమ్ ఘోర ప‌రాజ‌యం - యాభై ర‌న్స్‌కే ఆలౌట్‌

HT Telugu Desk HT Telugu

17 July 2023, 12:27 IST

google News
  • Major League Cricket 2023: మేజ‌ర్ లీగ్ క్రికెట్‌లో న‌రైన్‌, ర‌సెల్, గ‌ప్టిల్ వంటి టీ20 హిట్ట‌ర్ల‌తో నిలిండిన లాస్ ఎంజిలాస్ నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు కేవ‌లం 50 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఎమ్ఐ న్యూయార్క్ చేతిలో దారుణ ఓట‌మిని చ‌విచూసింది.

లాస్ ఎంజిలాస్ నైట్ రైడ‌ర్స్ వర్సెస్. ఎమ్ఐ న్యూయార్క్
లాస్ ఎంజిలాస్ నైట్ రైడ‌ర్స్ వర్సెస్. ఎమ్ఐ న్యూయార్క్

లాస్ ఎంజిలాస్ నైట్ రైడ‌ర్స్ వర్సెస్. ఎమ్ఐ న్యూయార్క్

Major League Cricket 2023: మేజ‌ర్ లీగ్ క్రికెట్ టోర్నీలో లాస్ ఎంజిలాస్ నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు కేవ‌లం 50 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ర‌సెల్‌, న‌రైన్‌, రౌలీ రూసో, గ‌ప్టిల్ వంటి టీ20 హిట్ట‌ర్లు ఉన్న ఈజ‌ట్టు 50 ప‌రుగుల‌కే ఆలౌట్ కావ‌డం క్రికెట్ వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

మేజ‌ర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా ఎమ్ఐ న్యూయార్క్‌, లాస్ ఎంజిలాస్ నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య ఆదివారం మ్యాచ్ జ‌రిగింది. ఈ టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎమ్ఐ న్యూయార్క్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 155 ర‌న్స్ చేసింది.

ల‌క్ష్య ఛేద‌న‌లో లాస్ ఎంజిలాస్ నైట్ రైడ‌ర్స్ టీమ్ కేవ‌లం 50 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 105 ప‌రుగుల తేడాతో ఘోర ప‌రాజ‌యం పాలైంది. లాస్ ఎంజిలాస్ బ్యాట్స్‌మెన్స్‌లో టీమ్ ఇండియా ప్లేయ‌ర్ ఉన్ముక్త్ చంద్ 26 ర‌న్స్‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. టీమ్ మొత్తంలో అత‌డు ఒక్క‌టే డ‌బుల్ డిజిట్ స్కోరు చేశాడు. టీమ్ మొత్తం క‌లిపి ఉన్ముక్త్ చంద్ కంటే త‌క్కువ ప‌రుగులు చేశారు. మిగిలిన ప‌దిమంది బ్యాట్స్‌మెన్స్ క‌లిపి కేవ‌లం 21 ర‌న్స్ మాత్ర‌మే చేశారు.

లాస్ ఎంజిలాస్ టీమ్‌లో ఓపెన‌ర్ గ‌ప్టిల్‌తో పాటు న‌లుగురు బ్యాట్స్‌మెన్స్ డ‌కౌట్ అయ్యారు.కెప్టెన్ సునీల్ న‌రైన్ , ర‌సెల్ త‌లో రెండు ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచారు. ఎమ్ఐ న్యూయార్క్ బౌల‌ర్లు బౌల్ట్‌, పొల్లార్డ్‌, ర‌బాడ‌ త‌లో రెండు వికెట్ల‌తో ఆక‌ట్టుకున్నారు.

అంత‌కుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎమ ఐ న్యూయార్క్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 155 ర‌న్స్ చేసింది. టిమ్ డేవిడ్ 21 బాల్స్‌లో నాలుగు సిక్స‌ర్లు, నాలుగు ఫోర్ల‌తో 48 ర‌న్స్ చేయ‌గా...నికోల‌స్ పూర‌న్ 38 ర‌న్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. వీరిద్ద‌రు మిన‌హా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ రాణించ‌లేక‌పోయారు.

టాపిక్

తదుపరి వ్యాసం