తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kumble On Chahal: ఐపీఎల్‌లో అండ‌ర్‌రేటెడ్ ప్లేయ‌ర్స్ వీళ్లే - కుంబ్లే కామెంట్స్ వైర‌ల్‌

Kumble on Chahal: ఐపీఎల్‌లో అండ‌ర్‌రేటెడ్ ప్లేయ‌ర్స్ వీళ్లే - కుంబ్లే కామెంట్స్ వైర‌ల్‌

21 March 2023, 12:54 IST

  • Kumble on Chahal: ఐపీఎల్‌లో అండ‌ర్‌రేటెడ్ ప్లేయ‌ర్స్‌గా ఇద్ద‌రు ఆట‌గాళ్ల పేర్లు సూచించాడు టీమ్ ఇండియా మాజీ స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే. ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్లు ఎవ‌రంటే...

మ‌యాంక్ అగ‌ర్వాల్
మ‌యాంక్ అగ‌ర్వాల్

మ‌యాంక్ అగ‌ర్వాల్

Kumble on Chahal: మ‌రో ప‌ది రోజుల్లో ఐపీఎల్ స‌మ‌రం మొద‌లుకానుంది. అన్ని ప్రాంచైజీలు ప్రాక్టీస్ సెష‌న్స్ మొద‌లుపెట్టాయి. విదేశీ క్రికెట‌ర్లు ఒక్కొక్క‌రుగా జ‌ట్టులో చేరుతోన్నారు. ఐపీఎల్ 2023లో హీరోలుగా ఎవ‌రుగా నిలుస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. కోట్లు ప‌లికిన ఆట‌గాళ్ల‌లో ఎవ‌రు మెరుపులు మెరిపిస్తారోన‌ని క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠ‌గా ఎదురుచూస్తోన్నారు. కాగా ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఐపీఎల్‌లో మోస్ట్ అండ‌ర్‌రేటెడ్ ప్లేయ‌ర్స్‌ ఎవ‌ర‌ని అడిగిన ప్ర‌శ్న‌కు టీమ్ ఇండియా మాజీ స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

య‌జువేంద్ర చాహ‌ల్‌తో పాటు మ‌యాంక్ అగ‌ర్వాల్ పేర్ల‌ను సూచించాడు.ఐపీఎల్‌లో మ‌యాంక్ అగ‌ర్వాల్ చ‌క్క‌టి బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రుస్తోన్నాడు. ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌ల‌ను ఆడాడు.

కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ అవేవీ ఎక్కువ‌గా ప్ర‌చారంలోకి రాలేదు.త‌న బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో జ‌ట్టుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే సామ‌ర్థ్యాలు చాహాల్‌కు ఉన్నాయి. ఐపీఎల్‌లో చాలా సార్లు బౌలింగ్ ప‌ఠిమ‌తో చాహ‌ల్ ఆ విష‌యాన్ని రుజువు చేశాడు.

చాహ‌ల్‌, మ‌యాంక్‌ల‌కు అద్భుత‌మైన ప్ర‌తిభ‌పాఠ‌వాలు ఉన్నా అందుకు త‌గ్గ‌ట్లుగా పేరుప్ర‌ఖ్యాతులు, అవ‌కాశాలు మాత్రం వారికి ద‌క్క‌లేదు అంటూ కుంబ్లే స‌మాధానం ఇచ్చాడు. కుంబ్లే స‌మాధానాలు ఆస‌క్తిక‌రంగా మారాయి.

ఈ సీజ‌న్‌లో హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ త‌ర‌ఫున మ‌యాంక్ అగ‌ర్వాల్ బ‌రిలో దిగుతోన్నాడు. 8.25 కోట్ల‌కు అత‌డిని ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. మ‌రోవైపు చాహ‌ల్ ఐపీఎల్ 2023లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించ‌బోతున్నాడు.