తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kl Rahul Catch: రాహుల్ కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో వైరల్

KL Rahul Catch: రాహుల్ కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu

17 February 2023, 14:40 IST

google News
    • KL Rahul Catch: కేఎల్ రాహుల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో అతడు పట్టిన క్యాచ్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.
డైవ్ చేస్తూ క్యాచ్ పట్టుకుంటున్న కేెఎల్ రాహుల్
డైవ్ చేస్తూ క్యాచ్ పట్టుకుంటున్న కేెఎల్ రాహుల్

డైవ్ చేస్తూ క్యాచ్ పట్టుకుంటున్న కేెఎల్ రాహుల్

KL Rahul Catch: ఇండియన్ టీమ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ పట్టుకున్న స్టన్నింగ్ క్యాచ్ వీడియో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఇచ్చిన క్యాచ్ అది. 81 రన్స్ చేసి సెంచరీపై కన్నేసిన అతడు.. రాహుల్ పట్టిన క్యాచ్ చూసి అవాక్కయ్యాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఈ అద్భుతం చోటు చేసుకుంది.

జడేజా బౌలింగ్ లో ఖవాజా రివర్స్ స్వీప్ చేయడానికి వెళ్లాడు. ఆ సయమంలో పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్.. కళ్లు మూసి తెరిచేలోపు తన కుడివైపుకు డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. అది చూసి ఖవాజా షాక్ తిన్నాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ లలోనూ విఫలమైన అతడు.. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే 81 రన్స్ దగ్గర అనవసర షాట్ ఆడటానికి ప్రయత్నించి ఔటయ్యాడు.

ఈ క్యాచ్, వికెట్ మ్యాచ్ ను మలుపు తిప్పాయని చెప్పొచ్చు. మరోవైపు ఇదే వికెట్ తో జడేజా కూడా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 250 వికెట్లు, 2500 రన్స్ చేసిన ఆల్ రౌండర్ గా అతడు నిలిచాడు. టెస్టు క్రికెట్ లో ఈ డబుల్ సాధించిన ఐదో ఇండియన్ క్రికెటర్ జడేజా. అతని కంటే ముందు కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, అశ్విన్ ఈ ఘనత సాధించారు.

తొలి టెస్టులో ఆల్ రౌండ్ పర్ఫార్మాన్స్ తో అదరగొట్టిన జడేజాకు రెండో టెస్టులో ఖవాజాదే తొలి వికెట్. అటు ఇదే టెస్టులో అశ్విన్ కూడా రెండు రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. ఆస్ట్రేలియాపై 100 వికెట్లు తీసిన రెండో ఇండియన్ బౌలర్ అశ్విన్. గతంలో కుంబ్లే ఈ ఘనత సాధించాడు. ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను రెండుసార్లు డకౌట్ చేసిన తొలి బౌలర్ కూడా అశ్వినే.

తదుపరి వ్యాసం