తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kl Rahul: జట్టులోకి రాహుల్ వచ్చాడు.. కెప్టెన్‌గా ధావన్‌ను తప్పించారు

KL Rahul: జట్టులోకి రాహుల్ వచ్చాడు.. కెప్టెన్‌గా ధావన్‌ను తప్పించారు

11 August 2022, 21:54 IST

google News
    • కేఎల్ రాహుల్ జట్టులోకి పునరాగమనం చేయడంతో జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. తొలుత ధావన్ కెప్టెన్‌గా చేయగా.. రాహుల్ రాకతో అతడు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ (PTI)

కేఎల్ రాహుల్

ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన శిఖర్ ధావన్.. తన నేతృత్వంలో సిరీస్‌ను 3-0 తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు. దీంతో ఈ నెల 18 నుంచి జింబాబ్వేతో జరగనున్న మూడు వన్డేల టీ20 సిరీస్‌కూ గబ్బర్‌నే సారథిగా నియమించారు. ఇదిలా ఉంటే గాయం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌కు పునరాగమనం చేశాడు. దీంతో కెప్టెన్‌గా ధావన్‌ను తొలగించి రాహుల్‌కు అప్పగించింది బీసీసీఐ.

కేఎల్ రాహుల్ ఫిట్‌గా ఉండటంతో జింబాబ్వేతో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌కు రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించింది. తొలుత జులై 30న శిఖర్ ధావన్ కెప్టెన్సీలో 15 సభ్యుల టీమిండియాను ప్రకటించింది. అప్పుడు కేఎల్ రాహుల్ అందుబాటులోకి రాలేదు. తాజాగా ధావన్ స్థానంలో రాహుల్‌ను నియమించింది. గబ్బర్‌ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది.

జింబాబ్వేతో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌కు కేఎల్ రాహుల్ ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ వైద్య బృందం కన్ఫార్మ్ చేసింది. దీంతో ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించింది. శిఖర్ ధావన్‌ను అతడికి డిప్యూటీగా సూచించింది. అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.

కేఎల్ రాహుల్ ఇప్పటికే ఆసియా కప్‌ జట్టులోనూ స్థానం దక్కించుకున్నాడు. గాయం ఆ తర్వాత కోవిడ్ బారిన పడటం వల్ల చాలా గ్యాప్ తర్వాత జట్టులోకి పునరాగమనం చేస్తున్నాడు ఈ కర్ణాటక ప్లేయర్. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు కేఎల్ రాహుల్ గాయం కారణంగా బాధపడ్డాడు. అయితే కోలుకుని ఆడతాడనుకునే లోపే తిరిగి గాయం కావడంతో సౌతాఫ్రికా సిరీస్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా విరామం మరింత పెరిగింది. తాజాగా ఆసియా కప్ టీ20 లీగ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. దీని కంటే ముందు జింబాబ్వేతో వన్డే సిరీస్‌ ఆడనున్నాడు.

కేఎల్ రాహుల్ రాకతో జట్టులో మొత్తం 16 మంది అయ్యారు. ఈ టీమ్‌కు కేఎల్ రాహుల్ నేతృత్వం వహించనున్నాడు. ఈ నెల 18 నుంచి జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ నుంది టీమిండియా.

జింబాబ్వేతో ఆడనున్న వన్డే జట్టు..

కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.

తదుపరి వ్యాసం