Kl Rahul at Ujjaini Temple: ఉజ్జయిని టెంపుల్‌లో భార్యతో కలిసి కేఎల్ రాహుల్ ప్రత్యేక పూజలు
26 February 2023, 15:43 IST
Kl Rahul at Ujjaini Temple: టీమ్ ఇండియా ఓపెనర్ కె.ఎల్ రాహుల్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్‌ను దర్శించారు. భార్య అతియాశెట్టితో కలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కె.ఎల్ రాహుల్ , అతియాశెట్టి
Kl Rahul at Ujjaini Temple: టీమ్ ఇండియా ఓపెనర్ కె.ఎల్ రాహుల్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్‌ను సందర్శించారు. భార్య అతియాశెట్టితో కలిసి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాహుల్, అతియాశెట్టి టెంపుల్‌లో పూజ చేస్తోన్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వీడియోల్లో ట్రెడిషనల్ దుస్తుల్లో వీరిద్దరు కనిపించారు. రాహుల్ ధోతీ ధరించి కనిపించగా అతియాశెట్టి ఎల్లో కలర్ గోల్డ్ శారీలో కనిపించింది. పెళ్లి తర్వాత వీరిద్దరు తొలిసారి ఉజ్జయిని టెంపుల్ దర్శించుకున్నారు.
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కె.ఎల్ రాహుల్ సభ్యుడిగా ఉన్నారు. మూడో టెస్ట్‌కు మధ్య గ్యాప్ రావడంతో టీమ్ ఇండియా క్రికెటర్లు ప్రాక్టీస్ సెషల్‌కు స్వల్ప విరామం తీసుకున్నారు.
ఈబ్రేక్‌లోనే రాహుల్ ఉజ్జయిని టెంపుల్ దర్శించుకున్నట్లు చెబుతున్నారు. గత జనవరి 23న రాహుల్, అతియాశెట్టి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే ఆస్ట్రేలియా సిరీస్ కోసం జట్టులో చేరాడు రాహుల్. ఈ రెండు టెస్ట్‌ల్లో బ్యాటింగ్ పరంగా రాహుల్ విఫలమయ్యాడు. కేవలం 38 పరుగులు మాత్రమే చేసిన నేపథ్యంలో అతడికి మూడో టెస్ట్‌లో చోటు దక్కడం అనుమానంగా మారింది.
టాపిక్