తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2022 | చెన్నైని చిత్తు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌

IPL 2022 | చెన్నైని చిత్తు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌

Hari Prasad S HT Telugu

26 March 2022, 23:14 IST

google News
    • IPL 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను 6 వికెట్లతో చిత్తు చేసింది. గతేడాది ఫైనల్లో పరాజయానికి కోల్‌కతా ప్రతీకారం తీర్చుకుంది.
44 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించిన రహానే
44 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించిన రహానే (PTI)

44 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించిన రహానే

ముంబై: ఐపీఎల్‌ 15వ సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది కోల్‌కతా నైట్‌రైడర్స్‌. కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్ చెన్నైని 6 వికెట్లతో ఓడించింది. 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా.. మరో 9 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ధోనీ (38 బంతుల్లో 50) ఫైటింగ్‌ హాఫ్ సెంచరీ వృథా అయింది. కోల్‌కతా తరఫున ఇద్దరు సీనయర్‌ ప్లేయర్స్‌ ఉమేష్‌ యాదవ్‌ (2 వికెట్లు), అజింక్య రహానే (44 రన్స్‌) రాణించడం విశేషం. కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సామ్‌ బిల్లింగ్స్‌ 25, నితీష్‌ రాణా 21 పరుగులు చేశారు. దీంతో కోల్‌కతా 18.3 ఓవర్లలో కోల్‌కతా మ్యాచ్‌ను ముగించింది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై టీమ్‌.. 20 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్ల ధాటికి ఒక దశలో 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన చెన్నైని కెప్టెన్‌ జడేజా, మాజీ కెప్టెన్‌ ధోనీ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 70 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ధోనీ కేవలం 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మొదట్లో మెల్లగా మొదలుపెట్టి తర్వాత జోరు అందుకున్న ధోనీ.. 7 ఫోర్లు, ఒక సిక్స్‌ బాదాడు. మరోవైపు జడేజా 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాబిన్‌ ఉతప్ప కూడా 21 బంతుల్లో 28 పరుగులతో రాణించాడు. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డెవోన్‌ కాన్వేతోపాటు రాయుడు, శివమ్‌ దూబె విఫలమయ్యారు.

టాపిక్

తదుపరి వ్యాసం