Jos Buttler | ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి రికార్డు సమం చేసిన జోస్ బట్లర్
28 May 2022, 5:53 IST
- ఈ ఏడాది ఐపీఎల్‌లో జోస్ బట్లర్ దూకుడుకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. టీమ్ ఏదైనా బాదడమే పనిగా పెట్టుకున్న అతడు.. ఈ క్రమంలో విరాట్ కోహ్లి అరుదైన రికార్డును సమం చేశాడు.
రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్
అహ్మదాబాద్: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ రెండో క్వాలిఫయర్‌లో చెలరేగిపోయాడు. కేవలం 59 బాల్స్‌లోనే సెంచరీ చేసి.. రాయల్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. 158 పరుగుల టార్గెట్ చేజింగ్‌లో షో అంతా బట్లర్‌దే. ఒంటి చేత్తో అతడు తన టీమ్‌ను గెలిపించాడు. అతని దూకుడుతో 7 వికెట్లతో ఆర్సీబీని చిత్తు చేసిన రాయల్స్.. 2008లో తొలి సీజన్ తర్వాత మళ్లీ ఇప్పుడు ఫైనల్ చేరింది.
ఈ క్రమంలో అతడు ఐపీఎల్‌లో అరుదైన విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. బట్లర్‌కు 2022 ఐపీఎల్‌లో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. దీంతో ఒకే సీజన్‌లో అత్యధిక సెంచరీల రికార్డును అతడు సమం చేశాడు. గతంలో 2016 సీజన్‌లో విరాట్ కోహ్లి 4 సెంచరీలు చేశాడు. ఇప్పుడు ఆర్సీబీ ఇంటికెళ్లిపోయింది. రాయల్స్ ఫైనల్ చేరడంతో అక్కడ కోహ్లిని వెనక్కి నెట్టే అవకాశం బట్లర్‌కు ఉంది.
ఈ నెల 29 (ఆదివారం)న గుజరాత్ టైటన్స్‌తో ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది రాజస్థాన్ రాయల్స్. ఆర్సీబీతో మ్యాచ్‌లో మొదట యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడగా.. అతడు ఔటైన తర్వాత బట్లర్ తన విశ్వరూపం చూపించాడు. కేవలం 23 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత కాస్త దూకుడు తగ్గించిన అతడు.. మ్యాక్స్‌వెల్ వేసిన 18వ ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 19వ ఓవర్ తొలి బంతికే సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
టాపిక్