తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Jonty Rhoads On Team India: 2023 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ఇండియానే గెలుస్తుంది - జాంటీ రోడ్స్ జోస్యం

Jonty Rhoads on Team India: 2023 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ఇండియానే గెలుస్తుంది - జాంటీ రోడ్స్ జోస్యం

23 February 2023, 8:06 IST

  • Jonty Rhoads on Team India: ఈ ఏడాది ఇండియా వేదిక‌గా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమ్ ఇండియానే ఫేవ‌రేట్ అని సౌతాఫ్రికా దిగ్గ‌జ క్రికెట‌ర్ జాంటీ రోడ్స్ పేర్కొన్నాడు.

టీమ్ ఇండియా
టీమ్ ఇండియా

టీమ్ ఇండియా

Jonty Rhoads on Team India: ఈ ఏడాది జ‌రుగ‌నున్న వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమ్ ఇండియానే ఫేవ‌రేట్‌గా బ‌రిలో దిగ‌నున్న‌ట్లు సౌతాఫ్రికా మాజీ క్రికెట‌ర్ జాంటీ రోడ్స్ తెలిపాడు. టైటిల్ గెలిచే స‌త్తా టీమ్ ఇండియాకే ఉంద‌ని అన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్ వంటి మేటి బ్యాట్స్‌మెన్స్‌తో పాటు హార్దిక్‌, జ‌డేజా వంటి ఆల్‌రౌండ‌ర్ల‌తో ఇండియా టీమ్ ప‌టిష్టంగా ఉంద‌ని జాంటీ రోడ్స్ చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

స్వ‌దేశంలో ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగ‌నుండ‌టం టీమ్ ఇండియాకు క‌లిసివ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు జాంటీ రోడ్స్ పేర్కొన్నాడు. 2023 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ అక్టోబ‌ర్, న‌వంబ‌ర్ నెల‌ల్లో జ‌రుగ‌నుంది. పూర్తిగా వ‌ర‌ల్డ్ క‌ప్ మొత్తానికి ఇండియానే ఆతిథ్యం ఇవ్వ‌బోతుండ‌టం ఇదే మొద‌టిసారి.

గ‌తంలో 1987, 1996, 2011ల‌లో ఇత‌ర ఆసియా దేశాల‌తో క‌లిసి వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. 2023 వ‌ర‌ల్డ్ క‌ప్‌ ఫిబ్ర‌వ‌రిలోనే మొద‌లుకావాల్సింది. కానీ కొవిడ్ దృష్ట్యా అక్టోబ‌ర్‌కు వాయిదావేశారు.

మొత్తం ప‌ది జ‌ట్లు ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాల్గొన‌బోతున్నాయి. ఏడు దేశాలు నేరుగా క్వాలిఫై కాగా, మ‌రో మూడు దేశాలు క్వాలిఫైయ‌ర్ మ్యాచ్‌లు ఆడి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో చోటు ద‌క్కించుకోనున్నాయి.

తదుపరి వ్యాసం