తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Auction | ఐపీఎల్‌ వేలంపై బుమ్రా ట్వీట్‌.. అర్థం కాక తలపట్టుకుంటున్న ఫ్యాన్స్

IPL Auction | ఐపీఎల్‌ వేలంపై బుమ్రా ట్వీట్‌.. అర్థం కాక తలపట్టుకుంటున్న ఫ్యాన్స్

Hari Prasad S HT Telugu

13 February 2022, 11:16 IST

google News
    • ఐపీఎల్‌ మెగా వేలంపై టీమిండియా పేస్‌ బౌలర్‌ బుమ్రా చేసిన ట్వీట్‌ ఒకటి వైరల్‌గా మారింది. అసలు ఈ ట్వీట్‌కు అర్థమేంటో తెలియక ఫ్యాన్స్‌ తలపట్టుకుంటున్నారు.
ఐపీఎల్లో బుమ్రాను రిటేన్ చేసుకున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్లో బుమ్రాను రిటేన్ చేసుకున్న ముంబై ఇండియన్స్ (AFP)

ఐపీఎల్లో బుమ్రాను రిటేన్ చేసుకున్న ముంబై ఇండియన్స్

బెంగళూరు: ఐపీఎల్‌ మెగా వేలంలో తొలి రోజు కొన్ని సంచలనాలు చోటు చేసుకున్న విషయం తెలుసు కదా. యువ వికెట్ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ ఏకంగా రూ.15.25 కోట్లు పలకడం, అసలు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడని అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ అవేష్‌ ఖాన్‌ రూ.10 కోట్లతో చరిత్ర సృష్టించడం వంటివి చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేశాయి. 

అదే సమయంలో వార్నర్‌, డీకాక్‌లాంటి స్టార్లు తక్కువ ధరకే సరిపెట్టుకోవడం, రైనా, స్మిత్‌లాంటి వాళ్ల వైపు ఫ్రాంఛైజీలు అసలు చూడకపోవడమూ ఆశ్చర్యం కలిగించింది. ఇవన్నీ చూసిన తర్వాత టీమిండియా, ముంబై ఇండియన్స్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఓ ట్వీట్‌ చేశాడు. అందులో టెక్ట్స్‌ ఏమీ లేదు. కేవలం రెండు ఎమోజీలు మాత్రమే. ఒక పగలబడి నవ్వుతున్నది కాగా.. మరొకటి తలపట్టుకున్న ఎమోజీ.

అసలు ఈ ఎమోజీలకు అర్థమేంటి? బుమ్రా ఏ ఉద్దేశంతో వీటిని పోస్ట్‌ చేశాడో తెలుసుకోడానికి ఫ్యాన్స్‌ ప్రయత్నించారు. ఒక్కొక్కరు దీనికి ఒక్కో అర్థం ఇచ్చారు. వేలంలోకి వెళ్తే బాగుండేది.. ప్రసిద్ధ్‌ కృష్ణ, శార్దూల్‌లాంటి వాళ్లకు అంత భారీగా దక్కిందని అని బుమ్రా భావించి ఉండొచ్చని ఒకరు.. లాకీ ఫెర్గూసన్‌లాంటి బౌలర్‌ను రూ.10 కోట్లకు కొనుగోలు చేసినందుకే అతనిలా రియాక్టయ్యాడని మరొకరు.. చాలా నష్టపోయానని అనుకునే ఇలా చేశాడని ఇంకొకరు ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్‌ చూసిన తర్వాత మీకేమనిపిస్తోందో మీరూ కామెంట్ చేయండి.

తదుపరి వ్యాసం