తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ishan Kishan: ఆసియాకప్ లో చోటు దక్కకపోవడంపై ఇషాన్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ishan kishan: ఆసియాకప్ లో చోటు దక్కకపోవడంపై ఇషాన్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

HT Telugu Desk HT Telugu

13 August 2022, 12:38 IST

google News
  • ఆసియాకప్ లో తలపడనున్న భారత జట్టులో టీమ్ ఇండియా యువ ప్లేయర్ ఇషాన్ కిషన్ కు చోటు దక్కలేదు. ఆసియా కప్ టీమ్ సెలక్షన్స్ పై చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న ఇషాన్ తాజాగా స్పందించాడు. అతడు ఏమన్నాడంటే...

ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్ (twitter)

ఇషాన్ కిషన్

ఈ ఏడాది టీ20ల్లో నిలకడగా రాణించాడు టీమ్ ఇండియా యువ ప్లేయర్ ఇషాన్ కిషన్. 14 టీ20 మ్యాచుల్లో 130 స్ట్రైక్ రేట్ తో 430 రన్స్ చేసి మెప్పించాడు. 2022 ఏడాదిలో టీమ్ ఇండియా తరఫున టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు.

చక్కటి ఫామ్ లో ఉన్న అతడికి ఆసియా కప్ లో చోటు దక్కలేదు. టీమ్ ఇండియా సెలెక్టర్లు ఇషాన్ కిషన్ పక్కన పెట్టారు. అతడికి ఎంపిక చేయకపోవడంపై గత కొన్నాళ్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గాయంతో జట్టుకు దూరమైన కె.ఎల్ రాహుల్ ఆసియా కప్ లో చేరడంతో ఇషాన్ కిషన్ ప్లేస్ గల్లంతైంది. ఆసియా కప్ లో సెలెక్ట్ కాకపోవడంపై ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఇషాన్ తాజాగా స్పందించాడు. టీమ్ ఇండియాకు సెలెక్ట్ కాకపోవడాన్ని తాను పాజిటివ్ గానే తీసుకున్నట్లు తెలిపాడు.

‘ఆసియా కప్ కు దూరమవ్వడంతో మరింత హార్డ్ వర్క్ చేయడమే కాకుండా ఎక్కువ పరుగులు చేయాలన్నది నాకు అర్థమైంది. ఆ దిశగా దృష్టిపెడుతూ సెలెక్టర్ల నమ్మకాన్ని పొందడానికి కృషి చేస్తాను’ అని ఇషాన్ తెలిపాడు. ఈ విషయంలో సెలెక్లర్లను తాను తప్పుపడటం లేదని అన్నాడు. ఎవరిని ఎంపిక చేయాలి, తుది జట్టు ఏ ఆటగాడు ఉంటే మంచిదన్నది సెలెక్టర్లకు బాగా తెలుసునని చెప్పాడు. ఈ నెలాఖరు నుండి యూఏఈ వేదికగా ఆసియా కప్ జరుగనుంది. ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూప్ లో ఉండటం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

టాపిక్

తదుపరి వ్యాసం