తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ishan Kishan: నా కోసం వారిని బ్యాటింగ్ స్థానాలను మార్చుకోమని అడగలేను... ఇషాన్ కిషన్

Ishan Kishan: నా కోసం వారిని బ్యాటింగ్ స్థానాలను మార్చుకోమని అడగలేను... ఇషాన్ కిషన్

10 June 2022, 11:10 IST

google News
  • ఐపీఎల్ లో విఫలమైన ఇషాన్ కిషన్ సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకున్నాడు. 48 బాల్స్ లోనే 76 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో జట్టులో తనకు స్థానం గురించి ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు 

ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్ (twitter)

ఇషాన్ కిషన్

ఐపీఎల్ 2022 సీజన్ లో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆట‌గాళ్ల‌లో ఒక‌రిగా ఇషాన్ కిష‌న్ నిలిచాడు. 15.25 కోట్ల‌కు ముంబై ఇండియ‌న్స్ అత‌డిని కొనుగోలు చేసింది. కానీ ఆ ధ‌ర‌కు త‌గ్గ‌ట్లుగా ఆడ‌టంలో ఇషాన్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. అయినా కూడా అత‌డిపై న‌మ్మ‌కాన్ని ఉంచిన సెలెక్ట‌ర్లు సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న టీ20 సిరీస్ కోసం ఎంపిక‌చేశారు. ఈ సిరీస్ కు రోహిత్‌శ‌ర్మ‌కు విశ్రాంతి నివ్వ‌డం, కె.ఎల్ రాహుల్ గాయంతో దూర‌మ‌వ్వ‌డంతో రుతురాజ్ గైక్వాడ్ తో క‌లిసి  ఇషాన్ కిష‌న్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ రోల్ పోషించాడు.  

దూకుడు గా బ్యాటింగ్ చేసి ఇండియ‌న్ టీమ్ లో  టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. 48 బంతుల్లో 76 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓట‌మి పాలైన ఇషాన్ ఫామ్‌లోకి రావ‌డం సానుకూలంశంగా మారింది. ఈ మ్యాచ్ అనంత‌రం ఇషాన్ కిష‌న్ మాట్లాడుతూ త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాల‌ను వినియోగించుకోవ‌డానికే ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని అన్నాడు.రోహిత్ శర్మ, కె.ఎల్ రాహుల్ ప్రపంచస్థాయి మేటి బ్యాటర్లు అని ఇషాన్ కిషన్ తెలిపాడు. వారి అవసరం జట్టుకు ఎంతో ఉందని చెప్పాడు. టీమ్ ఇండియా తరఫున గొప్ప ఇన్నింగ్ లు ఆడుతూ దేశానికి ఎన్నో విజయాల్ని అందించారని అన్నాడు.  వారిని కాదని తనను ఓపెనర్ గా పంపించమని  మేనేజ్ మెంట్ ను ఆడగలేనని ఇషాన్ అన్నాడు.  

రోహిత్, రాహుల్ టీమ్ లో ఉన్నప్పుడు తాను జట్టులో ఉండాలా లేదా అన్నది ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పాడు. ఒకవేళ ఉంటే తన కోసం వారి బ్యాటింగ్ స్థానాలను మార్చుకోమని ఎప్పుడూ అడగనని పేర్కొన్నారు. ప్రాక్టీస్ సెషన్ లో కష్టపడుతూ జట్టు అవసరాలకు తగినట్లుగా రాణించడంపైనే తాను దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు.  అంతే తప్ప మిగిలిన అంశాల ను గురించి తాను పట్టించుకోవడం లేదని ఇషాన్ కిషన్ అన్నాడు. 

టాపిక్

తదుపరి వ్యాసం