తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Yashasvi Huge Ipl Feat: యశస్వీ అరుదైన ఘనత.. క్రిస్ గేల్, డివిలియర్స్ లాంటి దిగ్గజాల సరసన నిలిచిన బ్యాటర్

Yashasvi Huge IPL Feat: యశస్వీ అరుదైన ఘనత.. క్రిస్ గేల్, డివిలియర్స్ లాంటి దిగ్గజాల సరసన నిలిచిన బ్యాటర్

20 May 2023, 17:36 IST

    • Yashasvi Huge IPL Feat: యశస్వీ జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక స్ట్రైక్ రేటుతో పాటు 600కి పైగా పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ లిస్టులో నాలుగో స్థానంలో నిలిచాడు.
యశస్వీ జైస్వాల్
యశస్వీ జైస్వాల్ (IPL Twitter)

యశస్వీ జైస్వాల్

Yashasvi Huge IPL Feat: రాజస్థాన్ యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ అద్భుత ఫామ్‌తో అదరగొడుతోన్న సంగతి తెలిసిందే. తన యూనిక్ బ్యాటింగ్ శైలితో మెరుగైన ప్రదర్శన చేస్తూ దూసుకెళ్తున్నాడు. యశస్వీ ఇటీవల పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీతో రాణించాడు. 36 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా 138 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక స్ట్రైక్ రేటుతో 600కి పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 48.07 సగటుతో 625 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం సహా ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 124 పరుగులు చేశాడు. అంతేకాకుండా 163.61 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసాడు. ఫలితంగా 600 కంటే ఎక్కువ ఐపీఎల్ పరుగులు చేసి అత్యధిక స్ట్రైక్ రేటు కలిగిన బ్యాటర్ల సరసన యశస్వీ నిలిచాడు. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు క్రిస్ గేల్ ఉన్నాడు, రిషబ్ పంత్, డివిలియర్స్ ఉన్నారు.

క్రిస్ గేల్ 2011 ఐపీఎల్ సీజన్‌లో 183.13 స్ట్రైక్ రేటుతో 608 పరుగులు చేయగా.. పంత్ 2018 సీజన్‌లో 173.6 స్ట్రైక్ రేటుతో 684 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ 2016 ఐపీఎల్ సీజన్‌లో 168.8 స్ట్రైక్ రేటుతో 687 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.

పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అధ్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 4 వికెట్ల తేడాతో గెలిచింది. యశస్వీ జైస్వాల్, దేవదత్ పడిక్కల్ అర్ధ సెంచరీతో విజృంభించగా.. షిమ్రన్ హిట్మైర్ మెరుపులు మెరిపించాడు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఆకట్టుకునే ప్రదర్శనతో విజయాన్ని అందుకుంది. పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడా 2 వికెట్లు తీయగా.. సామ్ కరన్, అర్ష్‌దీప్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.