Rohit Breaks Kohli record: రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఐపీఎల్‌లో కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన హిట్ మ్యాన్
12 April 2023, 12:38 IST
- Rohit Breaks Kohli record: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
రోహిత్ శర్మ
Rohit Breaks Kohli record: దిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం నాడు జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ 45 బంతుల్లోనే 65 పరుగులతో చెలరేగాడు. ఫలితంగా ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆరంభం నుంచే దిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రోహిత్.. చక్కటి ప్రదర్శన చేశాడు. దాదాపు 25 ఇన్నింగ్స్ తర్వాత హిట్ మ్యాన్ ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ చేయడం గమనార్హం. ఇదే కాకుండా ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు.
దిల్లీపై అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. అతడు 33 మ్యాచ్‌ల్లో 977 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అంతకుముందు రోహిత్ కంటే ముందు కోహ్లీ ఉండేవాడు. విరాట్ 925 పరుగులు చేశాడు. మంగళవారం రోహిత్ అద్భుత అర్ధశతకం సాధించి కోహ్లీని అధిగమించి టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో హిట్ మ్యాన్ 32.56 సగటుతో 131.14 స్ట్రైక్ రేటును కలిగి ఉన్నాడు.
దిల్లీతో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 45 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్‌లో రోహిత్‌కు ఇది 41వ అర్ధశతకం. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన హిట్ మ్యాన్.. ముంబయి గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో దిల్లీపై ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతి వరకు పోరాడి గెలిచింది. ఆఖరి ఓవర్లో విజయానికి 5 పరుగులు అవసరం కాగా.. కేమరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ చివరి బంతి వరకు పోరాడి తమ జట్టుకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ(65) అర్ధశతకంతో మెరిశాడు. అతడు ఇషాన్ కిషన్‌తో(31) కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దిల్లీ బౌలర్లలో ముకేష్ కుమార్ 2 వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహమాన్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబయి తన తదుపరి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది. ఏప్రిల్ 16న వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.