తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Mohit Sharma On Final Over: ఆ రోజు రాత్రి మొత్తం నిద్ర‌పోలేదు - ఫైన‌ల్ ఓవ‌ర్‌పై మోహిత్ శ‌ర్మ కామెంట్స్‌

Mohit Sharma on Final Over: ఆ రోజు రాత్రి మొత్తం నిద్ర‌పోలేదు - ఫైన‌ల్ ఓవ‌ర్‌పై మోహిత్ శ‌ర్మ కామెంట్స్‌

HT Telugu Desk HT Telugu

31 May 2023, 13:20 IST

  • Mohit Sharma on Final Over: ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో ఆక‌ట్టుకున్నా గుజరాత్‌ను గెలిపించ‌లేక‌పోయాడు పేస‌ర్ మోహిత్ శ‌ర్మ‌. ఫైన‌ల్‌లో ఓట‌మి త‌ర్వాత ఆ రోజు రాత్రి మొత్తం తాను నిద్ర‌పోలేద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో మోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు.

మోహిత్ శ‌ర్మ‌
మోహిత్ శ‌ర్మ‌

మోహిత్ శ‌ర్మ‌

Mohit Sharma on Final Over: ఐపీఎల్‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా బ‌రిలో దిగి అద్భుత బౌలింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు గుజ‌రాత్ పేస‌ర్ మోహిత్ శ‌ర్మ‌. సోమ‌వారం జ‌రిగిన ఫైన‌ల్‌లో మూడు వికెట్లు తీసి ఆక‌ట్టుకున్నాడు. ఫైన‌ల్ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు చేయాల్సిన త‌రుణంలో మొద‌టి నాలుగు బాల్స్‌లో కేవ‌లం మూడు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు మోహిత్ శ‌ర్మ‌.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

దాంతో గుజ‌రాత్ గెలుపు ఖాయ‌మ‌ని క్రికెట్ ఫ్యాన్స్ భావించారు. కానీ చివ‌రి రెండు బాల్స్‌లో సిక్స్‌, ఫోర్ కొట్టి గుజ‌రాత్‌కు షాకిస్తూ చెన్నైని గెలిపించాడు జ‌డేజా. ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ ఓట‌మి పాలైన త‌న ఆట‌తీరుతో క్రికెట్ అభిమానుల మ‌న‌సుల్ని గెలుచుకున్నాడు మోహిత్ శ‌ర్మ‌.

ఈ ఫైన‌ల్ ఓవ‌ర్ బౌలింగ్ త‌ర్వాత ఓడిపోయిన బాధ‌లో ఆ రోజు రాత్రి మొత్తం తాను నిద్ర‌ పోలేద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో మోహిత్ శ‌ర్మ చెప్పాడు. ఫైన‌ల్ ముగిసిన త‌ర్వాత ఆ రోజు రాత్రి మొత్తం ఫైన‌ల్ ఓవ‌ర్ గురించే ఆలోచిస్తూఉండిపోయాన‌ని అన్నాడు. త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందో అర్థం కాక‌, ఇలా బాల్ వేస్తే బాగుండేదేమో, అలా బౌలింగ్ చేస్తే గెలిచేవాళ్ల‌మంటూ ఆలోచ‌న‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యాన‌ని అన్నాడు.

ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నానంటూ పేర్కొన్నాడు. ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందురోజు క‌ఠిన ప‌రిస్థితుల‌ను ఎలా ఎదుర్కోవాల‌న్న‌ది ముందుగానే ఊహించి నెట్స్‌లో చాలా శ్ర‌మించాన‌ని మోహిత్ శ‌ర్మ చెప్పాడు. ఫైన‌ల్ ఓవ‌ర్‌లో ఆరు బాల్స్‌ యార్క‌ర్స్ వేయాల‌ని అనుకున్నాన‌ని, అలాగే బౌలింగ్ చేశాన‌ని చెప్పాడు.

నాలుగు బాల్స్ అద్భుతంగా వేసిన త‌ర్వాత మోహిత్ శ‌ర్మ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన కెప్టెన్ హార్దిక్ ఏదో చెప్ప‌డం వీడియోల‌లో క‌నిపించింది. ఆ త‌ర్వాత మోహిత్ వేసిన రెండు బాల్స్ వ‌రుస‌గా జ‌డేజా సిక్స‌ర్‌, ఫోర్ కొట్ట‌డంతో గుజ‌రాత్ ఓట‌మి పాలైంది. హార్ధిక్ సూచ‌న‌ల వ‌ల్లే గుజ‌రాత్ ఈ మ్యాచ్‌లో ఓట‌మి పాలైంద‌ని అభిమానులు ఫైర్ అవుతోన్నారు. హార్ధిక్‌తో జ‌రిగిన సంభాష‌ణ‌పై కూడా మోహిత్ పెద‌వి విప్పాడు. నా ప్లాన్ ఏమిటో అడిగి తెలుసుకున్నాడు హార్దిక్‌. అంత‌కుమించి మా మ‌ధ్య ఎలాంటి టాపిక్ రాలేద‌ని పేర్కొన్నాడు