Dhoni Meets Pathirana Family: మతీషా గురించి చింతించకండి.. నేనున్నా.. ధోనీ హామీతో పేసర్ ఫ్యామిలీ ఆనందం
26 May 2023, 16:07 IST
- Dhoni Meets Pathirana Family: చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ మతీషా పతిరాణా ఫ్యామిలీని ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కలిశాడు. దీంతో మతీషా సోదరి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. మతీషా సురక్షితంగా ఉంటాడని తనకు నమ్మకమొచ్చిందని తెలిపారు.
మతీషా పతిరాణా కుటుంబాన్ని కలిసిన ధోనీ
Dhoni Meets Pathirana Family: క్రికెటర్లు మైదానంలో వృత్తిగతంగా ఓ ఫ్యామిలీ వలే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ అంతే అనుబంధాన్ని మెయింటేన్ చేస్తున్నారు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ మహమ్మద్ సిరాజ్.. కోహ్లీ సహా తన సహచర ఆటగాళ్లందరినీ తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మతీశ పతిరాణా తన సహచర సీఎస్‌కే ప్లేయర్లను ఆహ్వానించాడు. ఈ సందర్బంగా చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పతిరాణా కుటుంబ సభ్యులను కలిశాడు. మహీను కలవడంతో మతీషా పతిరాణా సోదరి విషుకా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా మతీషా.. సురక్షితమైన చేతుల్లో ఉన్నాడని సోషల్ మీడియా వేదికగా పోస్టు ద్వారా తెలియజేశారు.
"మతీషా గురించి మీరు చింతించాల్సిన పనిలేదు అతడు ఎప్పుడూ నాతోనే ఉంటాడు అని తలా అన్నప్పుడు మల్లి కచ్చితంగా సురక్షితంగా ఉన్నాడని అనిపించింది." అని మతీషా సోదరి విషుకా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టారు. అంతేకాకుండా ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.
శ్రీలంకకు చెందిన మతీషా పతిరాణా 2022 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఆ సీజన్‌లో అతడికి ఎక్కువ అవకాశాలు రాలేదు. అయితే ఈ సీజన్‌లో మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు. ధోనీ నేతృత్వంలో రాటుదేలిన అతడు.. డెత్ ఓవర్లలో సూపర్‌గా ఆడుతున్నాడు. ధోనీ తనపై నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా ఈ సీజన్‌లో సీఎస్‌కే తరఫున మూడో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. 11 మ్యాచ్‌ల్లో 7.91 సగటుతో 17 వికెట్లు తీశాడు.
ఇటీవల ధోనీ కూడా పతిరాణా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు టెస్టులకు దూరంగా ఉంటే బెటరని, 50 ఓవర్ల ఫార్మాట్‌లోనూ ఎక్కువ మ్యాచ్‌లు ఆడవొద్దని తాను అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఎందుకంటే పతిరాణా పెద్ద ఐసీసీ టోర్నమెంటల్లో ఆడాలని. ఎక్కువగా మారే ఆటగాడు కాదని అభిప్రాయపడ్డాడు. అతడిని క్లిష్ట సమయాల్లో ఉపయోగించుకోవాలని తెలిపాడు.
చెన్నై సూపర్ కింగ్స్.. ఇటీవల జరిగిన మొదటి క్వాలిపయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 10వ సారి ఫైనల్‌కు చేరింది. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా మే 2న ఐపీఎల్ ఫైనల్ ఆడనుంది.