IPL 2023 Points Table: ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో యంగ్ ప్లేయర్స్‌దే హవా - టాప్‌లో ఉన్నది వీళ్లే
01 May 2023, 11:33 IST
IPL 2023 Points Table: ముంబైపై సెంచరీ సాధించిన రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ లీడర్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. పర్పుల్ క్యాప్ లీడర్స్‌లో తుషార్ దేశ్‌పాండే నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచాడు.
తుషార్ దేశ్‌పాండే
IPL 2023 Points Table: ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో ముంబై చేతిలో రాజస్థాన్ ఓటమి పాలైన మూడో స్థానంలోనే కొనసాగుతోంది. పాయింట్స్ టేబుల్‌లో ఎనిమిది మ్యాచుల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఎనిమిది మ్యాచుల్లో ఐదు విజయాలతో లక్నో సెకండ్ ప్లేస్ దక్కించుకోగా, రాజస్థాన్ మూడో స్థానంలో కొనసాగుతోంది. నాలుగో స్థానంలో చెన్నై, ఐదో ప్లేస్‌లో పంజాబ్ ఉన్నాయి. ఎనిమిది మ్యాచుల్లో రెండు విజయాలతో పదో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ నిలవగా తొమ్మిదోస్థానంలో సన్‌రైజర్స్ ఫిక్స్ అయిపోయింది.
ఆరెంజ్ క్యాప్ లీడర్స్- యశస్వి టాప్
ముంబైపై మెరుపు శతకంలో అదరగొట్టిన రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ లీడర్స్ లో నంబర్ వన్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. 9 మ్యాచుల్లో 428 రన్స్ చేశాడు జైస్వాల్. అతడి తర్వాత స్థానంలో 422 రన్స్‌తో డుప్లెసిస్ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. మూడో స్థానంలో డేవాన్ కాన్వే (414 పరుగులు), నాలుగో స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ (354 రన్స్) ఉన్నారు.
పర్పుల్ క్యాప్ - తుషార్ నంబర్ వన్
పర్పుల్ క్యాప్ లిస్ట్‌లో చెన్నై యంగ్ పేసర్ తుషార్ దేశ్‌పాండే 17 వికెట్లతో నంబర్ వన్ ప్లేస్‌ను దక్కించుకొన్నాడు. తుషార్ తర్వాతి స్థానంలో అర్షదీప్‌సింగ్(15 వికెట్లు, మహ్మద్ సిరాజ్ (14 వికెట్లు) ఉన్నారు. నాలుగో స్థానంలో రషీద్ ఖాన్ (14 వికెట్లు), ఐదో స్థానంలో అశ్విన్ (13 వికెట్లు ) నిలిచారు.
టాపిక్