తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Points Table: ఆర్‌సీబీపై విజ‌యంతో టాప్ ప్లేస్‌కు చేరుకున్న‌ ల‌క్నో - ఆరెంజ్‌, ప‌ర్పుల్ క్యాప్ లీడ‌ర్స్‌ వీళ్లే

Ipl 2023 Points Table: ఆర్‌సీబీపై విజ‌యంతో టాప్ ప్లేస్‌కు చేరుకున్న‌ ల‌క్నో - ఆరెంజ్‌, ప‌ర్పుల్ క్యాప్ లీడ‌ర్స్‌ వీళ్లే

11 April 2023, 10:01 IST

  • Ipl 2023 Points Table: రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై అద్భుత విజ‌యంతో పాయింట్ల టేబుల్‌లో టాప్ ప్లేస్‌లోకి చేరుకున్న‌ది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌. ఆరెంజ్‌, ప‌ర్పుల్ క్యాప్ ప్లేయ‌ర్స్ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఎవ‌రెవ‌రు ఉన్నారంటే..

నికోల‌స్ పూర‌న్‌, స్టోయినిస్‌
నికోల‌స్ పూర‌న్‌, స్టోయినిస్‌

నికోల‌స్ పూర‌న్‌, స్టోయినిస్‌

Ipl 2023 Points Table: బెంగ‌ళూరుపై థ్రిల్లింగ్ విక్ట‌రీని అందుకున్న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఐపీఎల్ పాయింట్ల టేబుల్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకున్న‌ది. నాలుగు మ్యాచుల్లో మూడు విజ‌యాలు ఒక ఓట‌మితో ఆరు పాయింట్ల‌తో తొలి స్థానంలో నిలిచింది. ల‌క్నో జోరుతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సెకండ్ ప్లేస్‌కు ప‌డిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

అయితే ర‌న్‌రేట్ విష‌యంలో ల‌క్నో (+1.048) కంటే రాజ‌స్థాన్‌(+2.067) మెరుగ్గా ఉంది. రింకు సింగ్ మెరుపుల‌తో గుజ‌రాత్‌పై గ‌ట్టెక్కిన కోల్‌క‌తా మూడో స్థానంలో ఉండ‌గా డిఫెండింగ్ చాంఫియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ నాలుగో స్థానంలో ఉంది. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో గెలుపు బోణీ చేయ‌ని ముంబై ఇండియ‌న్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ పాయింట్స్ టేబుల్‌లో చివ‌రి ప్లేస్‌లో నిలిచాయి.

ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌

ఆరెంజ్ క్యాప్‌లో శిఖ‌ర్ ధావ‌న్ టాప్‌

ఐపీఎల్ 2023లో అత్య‌ధిక ర‌న్స్‌తో ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో శిఖ‌ర్ ధావ‌న్ టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతోన్నాడు. మూడు మ్యాచుల్లో 225 ప‌రుగులుచేశాడు శిఖ‌ర్ ధావ‌న్‌. చెన్నై ఓపెన‌ర్ రుతురాజ్ 189 ప‌రుగుల‌తో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. డుప్లెసిస్ (175 ర‌న్స్‌) మూడు, విరాట్ కోహ్లి (164 ర‌న్స్‌)నాలుగో స్థానాల్లో కొన‌సాగుతోన్నారు. 158 ర‌న్స్‌తో డేవిడ్ వార్న‌ర్ ఐదో స్థానంలో నిలిచాడు.

మార్క్‌వుడ్ ఫ‌స్ట్ ప్లేస్‌

ప‌ర్పుల్ క్యాప్ లిస్ట్‌లో ల‌క్నో సూప‌ర్ జాయింట్స్ పేస‌ర్ మార్క్‌వుడ్ తొమ్మిది వికెట్ల‌తో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అత‌డి త‌ర్వాత గుజ‌రాత్ స్పిన్న‌ర్ ర‌షీద్‌ఖాన్ సెకండ్ ప్లేస్‌లో నిల‌వ‌గా, చాహ‌ల్ (8 వికెట్లు) మూడో స్థానాన్ని ద‌క్కించుకున్నాడు. ర‌వి బిష్ణోయ్ (6 వికెట్లు)నాలుగు, అల్జారీ జోసెఫ్ (ఆరు వికెట్లు) నాలుగు, ఐదో స్తానాల్లో నిలిచారు.

తదుపరి వ్యాసం