తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Points Table: టాప్ త్రీలోకి అడుగుపెట్టిన చెన్నై - ఆరెంజ్ క్యాప్ లీడ‌ర్స్‌లో డుప్లెసిస్ నంబ‌ర్‌ వ‌న్‌

IPL 2023 Points Table: టాప్ త్రీలోకి అడుగుపెట్టిన చెన్నై - ఆరెంజ్ క్యాప్ లీడ‌ర్స్‌లో డుప్లెసిస్ నంబ‌ర్‌ వ‌న్‌

18 April 2023, 10:08 IST

  • IPL 2023 Points Table: బెంగ‌ళూరుపై అద్భుత విజ‌యంతో చెన్నై సూప‌ర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి చేరుకున్న‌ది. ఆరెంజ్ క్యాప్ లీడ‌ర్స్‌లో బెంగ‌ళూరు కెప్టెన్ డుప్లెసిస్ టాప్ ప్లేస్‌ను ద‌క్కించుకొన్నాడు.

డుప్లెసిస్
డుప్లెసిస్

డుప్లెసిస్

IPL 2023 Points Table: సోమ‌వారం బెంగ‌ళూరుతో జ‌రిగిన ఉత్కంఠ‌పోరులో అద్భుత విజ‌యాన్ని అందుకున్న‌ చెన్నై సూప‌ర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్‌లో దూసుకుపోయింది. టాప్ త్రీ ప్లేస్‌కు చేరుకుంది. ఐదు మ్యాచుల్లో మూడు విజ‌యాల‌తో ఆరు పాయింట్లు సొంతం చేసుకున్న‌ది ధోనీ సేన‌.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

మెరుగైన ర‌న్‌రేట్‌తో (+0.265) గుజ‌రాత్ టైటాన్స్‌, పంజాబ్ కింగ్స్‌ల‌ను వెన‌క్కి నెట్టింది. ఎనిమిది పాయింట్ల‌తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టాప్ ప్లేస్‌లో నిల‌వ‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రెండో స్థానంలో కొన‌సాగుతోంది. గుజ‌రాత్ టైటాన్స్ నాలుగో ప్లేస్‌లో, పంజాబ్ కింగ్స్ ఐదో స్థానంలో ఉన్నాయి.

ఆరెంజ్ క్యాప్ లీడ‌ర్స్‌లో డుప్లెసిస్ టాప్‌

చెన్నైతో జ‌రిగిన ట‌ఫ్ ఫైట్‌లో బెంగ‌ళూరును గెలిపించేందుకు విశ్వ ప్ర‌య‌త్నం చేసిన కెప్టెన్ డుప్లెసిస్ ఆరెంజ్ క్యాప్ లీడ‌ర్స్ లిస్ట్‌లో నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. ఐదు మ్యాచుల్లో 259 ప‌రుగుల‌తో డుప్లెసిస్ టాప్ ప్లేస్‌లో నిల‌వ‌గా వెంక‌టేష్ అయ్య‌ర్ (234 ర‌న్స్‌) సెకండ్ ప్లేస్‌ను ద‌క్కించుకొన్నాడు. మూడో స్థానంలో శిఖ‌ర్ ధావ‌న్ (233 ర‌న్స్‌), నాలుగో ప్లేస్‌లో శుభ్‌మ‌న్ గిల్ (228 ర‌న్స్‌) నిలిచారు.

ప‌ర్పుల్ క్యాప్ లీడ‌ర్స్‌లో…

ప‌ర్పుల్ క్యాప్ లిస్ట్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్పిన్న‌ర్ య‌జువేంద్ర చాహ‌ల్ మొద‌టి స్థానంలో కొన‌సాగుతోన్నాడు. చాహ‌ల్‌, మార్క్‌వుడ్‌, ర‌షీద్‌ఖాన్ 11 వికెట్ల‌తో స‌మానంగా ఉన్నారు. కానీ అతి త‌క్కువ ఎకాన‌మీ రేటుతో చాహ‌ల్... మార్క్‌వుడ్‌, ర‌షీద్‌ఖాన్‌ల‌ను దాటేసి నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ద‌క్కించుకున్నాడు. మార్క్‌వుడ్ రెండో స్థానంలో, ర‌షీద్‌ఖాన్ మూడో స్థానంలో ఉన్నారు.

తదుపరి వ్యాసం