తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Mi Vs Gt: ర‌షీద్‌ఖాన్ సిక్స‌ర్ల సునామీ - ముంబైపై పోరాడి ఓడిన గుజ‌రాత్‌

MI vs GT: ర‌షీద్‌ఖాన్ సిక్స‌ర్ల సునామీ - ముంబైపై పోరాడి ఓడిన గుజ‌రాత్‌

HT Telugu Desk HT Telugu

13 May 2023, 6:20 IST

google News
  • MI vs GT: సూర్య‌కుమార్ సెంచ‌రీతో మెర‌వ‌డంతో గుజ‌రాత్ టైటాన్స్‌పై ముంబై ఇండియ‌న్స్ 27 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది. ర‌షీద్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న వృథాగా మారింది.

 ర‌షీద్ ఖాన్
ర‌షీద్ ఖాన్

ర‌షీద్ ఖాన్

MI vs GT: శుక్ర‌వారం ముంబై ఇండియ‌న్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్ నువ్వా నేనా అన్న‌ట్లుగా పోటాపోటీగా సాగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ 218 ప‌రుగులు చేయ‌గా...ల‌క్ష్య ఛేద‌న‌లో పోరాడిన గుజ‌రాత్‌ 191 ప‌రుగులు చేసింది. 27 ర‌న్స్‌తో ఓట‌మి పాలైంది.

ముంబై విధించిన 219 ప‌రుగుల టార్గెట్‌తో సెకండ్ బ్యాటింగ్ దిగిన గుజ‌రాత్ 50 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. వృద్ధిమాన్ సాహా, శుభ్‌మ‌న్‌గిల్‌తో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్య సింగిల్ డిజిట్‌కే పెవిలియ‌న్ చేరుకున్నారు.

ఈ త‌రుణంలో విజ‌య్ శంక‌ర్ (14 బాల్స్‌లో ఆరు ఫోర్ల‌తో 29 ర‌న్స్‌), డేవిడ్ మిల్ల‌ర్ (26 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 41 ర‌న్స్‌) క‌లిసి గుజ‌రాత్ స్కోరును వంద ప‌రుగులు దాటించారు. వారు కూడా ఔట్ కావ‌డంతో 103 ప‌రుగుల‌కే గుజ‌రాత్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. డిఫెండింగ్ ఛాంపియ‌న్‌కు దారుణ ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని అనుకున్నారు. కానీ చివ‌ర‌లో అనూహ్యంగా విజృంభించిన ర‌షీద్‌ఖాన్ సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు.

కేవ‌లం 32 బాల్స్‌లోనే 10 సిక్స‌ర్లు మూడు ఫోర్ల‌తో 79 ర‌న్స్‌తో నాటౌట్‌గా మిగిలాడు. ర‌షీద్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 191 ప‌రుగులు వ‌ద్ద గుజ‌రాత్ ఇన్నింగ్స్ ముగిసింది. ముంబై బౌల‌ర్ల‌లో ఆకాష్ మూడు, పీయూష్ చావ్లా, కార్తికేయ త‌లో రెండు వికెట్లు తీసుకున్నారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్ల న‌ష్టానికి 218 ర‌న్స్ చేసింది. సూర్య‌కుమార్ యాద‌వ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 49 బాల్స్‌లోనే 11 ఫోర్లు, ఆరు సిక్స‌ర్ల‌తో 103 ర‌న్స్ చేశాడు. విష్ణు వినోద్ (30 ర‌న్స్‌), ఇషాన్ కిష‌న్ (30 ర‌న్స్‌) ర‌న్స్‌తో రాణించ‌డంతో ముంబై భారీ స్కోరు చేసింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్‌ఖాన్‌కు నాలుగు వికెట్లు ద‌క్కాయి.

తదుపరి వ్యాసం