SRH vs KKR: చేజేతులా ఓటమిని కొనితెచ్చుకున్న సన్‌రైజర్స్ - కోల్‌కతాకు విక్టరీ అందించిన వరుణ్ చక్రవర్తి
05 May 2023, 6:19 IST
SRH vs KKR: ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేజేతులా ఓటమిని కొనితెచ్చుకున్నది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఐదు పరుగులు తేడాతో కోల్‌కతా చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది
కోల్‌కతా వర్సెస్ సన్‌రైజర్స్
SRH vs KKR: కోల్‌కతాపై సన్‌రైజర్స్ గెలవాలంటే చివరి ఓవర్‌లో తొమ్మిది రన్స్ చేయాలి. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్. కానీ ఒత్తిడికి తలవంచిన సన్‌రైజర్స్ తొమ్మిది పరుగులు చేయలేక చిత్తయింది. చివరి ఓవర్‌లో అద్భుత బౌలింగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోల్‌కతాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు రన్స్ తేడాతో సన్‌రైజర్స్‌పై కోల్‌కతా విజయాన్ని సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇరవై ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు జేసన్‌రాయ్, గుర్భాజ్‌తో పాటు వెంకటేష్ అయ్యర్ విఫలమైనా కెప్టెన్ నితీష్ రానా (31 బాల్స్‌లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 42 రన్స్), రింకు సింగ్ (35 బాల్స్‌లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్‌తో 46 పరుగులు ) కలిసి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించారు.
రసెల్ 15 బాల్స్‌లో 24 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్, జాన్సన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. 172 పరుగుల టార్గెట్‌తో సెకండ్ బ్యాటింగ్ చేపట్టిన సన్‌రైజర్స్ ఇరవై ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 166 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ నితీష్ రానా (40 బాల్స్‌లో 41 రన్స్) , క్లాసెన్ 20 బాల్స్‌లో మూడు సిక్సర్లు ఒక ఫోర్‌తో 36 రన్స్ చేసి సన్‌రైజర్స్‌ను గెలుపు దిశగా నడిపించారు.
చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరమైన తరుణంలో అబ్దుల్ సమద్ (18 బాల్స్‌లో మూడు ఫోర్లతో 21 రన్స్)క్రీజులో ఉండటంతో సన్‌రైజర్స్ గెలుస్తుందని అభిమానులు భావించారు. కానీ చక్కటి బౌలింగ్‌తో సమద్‌ను ఔట్ చేయడమే కాకుండా ఈ ఓవర్‌లో మూడు రన్స్ మాత్రమే ఇచ్చిన కోల్‌కతా స్పిన్సర్ వరుణ్ చక్రవర్తి సన్‌రైజర్స్‌కు షాక్ ఇచ్చాడు.
కోల్‌కతా బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్, వైభవ్ అరోరా తలో రెండు వికెట్లతో మెరవగా వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లలో ఇరవై రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.