తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Closing Ceremony : ఐపీఎల్ 2023 ముగింపు వేడుకకు Bcci మెగా ప్లాన్

IPL 2023 Closing Ceremony : ఐపీఎల్ 2023 ముగింపు వేడుకకు BCCI మెగా ప్లాన్

HT Telugu Desk HT Telugu

27 May 2023, 7:36 IST

    • IPL 2023 Closing Ceremony : ఐపీఎల్ 2023 ఫైనల్‌కు ముందు ముగింపు వేడుకను నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు యోచిస్తోంది. దీన్ని ఘనంగా నిర్వహించాలని అనుకుంటోంది.
ఐపీఎల్
ఐపీఎల్

ఐపీఎల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ 16వ ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. మిగిలింది ఒక గేమ్‌ మాత్రమే. ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి క్వాలిఫయర్‌లో విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ముంబైపై గుజరాత్ సూపర్ విక్టరీ సాధించింది. మే 28న ఆదివారం జరిగే IPL 2023 ఫైనల్‌లో CSKతో గుజరాత్ ట్రోఫీ కోసం పోరాడుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఇప్పుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు IPL 2023 ఫైనల్‌కు ముందు ముగింపు వేడుకను నిర్వహించాలని యోచిస్తోంది. దీన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఐపీఎల్ 2023 ముగింపు వేడుక అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇది సాయంత్రం 6:00 గంటల నుండి ప్రారంభమవుతుంది. IPL 2023 ముగింపు వేడుకలో ప్రముఖ సంగీతకారుడు AR రెహమాన్, బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రదర్శన కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ముగింపు వేడుకలో రాపర్స్ కింగ్, DJ న్యూక్లియా ప్రదర్శన ఇవ్వనున్నారు. వీరితో పాటు డివైన్, జోనితా గాంధీ మిడ్ టైమ్ షోలో అభిమానులను అలరించనున్నట్లు సమాచారం. మ్యాచ్‌కు ముందు కింగ్, న్యూక్లియా అభిమానులను అలరించనుండగా, మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ తర్వాత జోనితా గాంధీ, డివైన్ జోడీ ప్రదర్శన ఉండనుంది. IPL 2023 ఫైనల్ మ్యాచ్ కోసం నరేంద్ర మోదీ స్టేడియంలో అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షకులు IPL 2023 ముగింపు వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. జియో సినిమాలోనూ చూడవచ్చు.

ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుక మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. అరిజిత్ సింగ్, తమన్నా భాటియా, రష్మిక మందన ఈ ప్రారంభ వేడుకలో ప్రదర్శన ద్వారా టోర్నమెంట్‌కు మంచి ప్రారంభాన్ని అందించారు. ప్రారంభ వేడుకలను చూసేందుకు 1 లక్ష మందికి పైగా ప్రజలు స్టేడియంలో తరలివచ్చారు. OTT ప్లాట్‌ఫారమ్‌లో 1 కోటి మందికి పైగా మొదటి మ్యాచ్‌ని, ప్రారంభ వేడుకను వీక్షించారు.

తదుపరి వ్యాసం