IPL Rare Records: ఐపీఎల్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ ఎవరంటే
27 March 2023, 13:43 IST
IPL Rare Records: ఐపీఎల్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన రికార్డ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ పేరిట ఉంది. ఆ బౌలర్ ఎవరంటే...
భువనేశ్వర్ కుమార్
Bhuvneshwar Kumar: టీ20 క్రికెట్ అంటేనే ధనాధన్ బ్యాటింగ్‌కు చిరునామాగా చెబుతుంటారు. సిక్సర్లు, ఫోర్లతో అభిమానులను కనువిందు చేయడానికే బ్యాట్స్‌మెస్ ప్రయత్నిస్తుంటారు.టీ20ల్లో బ్యాట్స్‌మెన్స్ దూకుడికి కళ్లెం వేయడం బౌలర్లకు సవాల్‌గా నిలుస్తుంటుంది.
ఐపీఎల్ లో బ్యాట్స్‌మెన్స్ జోరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ షాట్స్‌కు పెట్టింది పేరైన ఐపీఎల్‌లో మహా అయితే వంద డాట్ బాల్స్ వేయడం కష్టమే. కానీ భువనేశ్వర్ కుమార్ మాత్రం ఐపీఎల్ కెరీర్‌లో మొత్తంగా 1406 డాట్ బాల్స్ వేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్‌లో మొత్తం 146 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ 542 ఓవర్లు వేశాడు. ఇందులో 1406 డాట్ బాల్స్ ఉండటం గమనార్హం.
ఐపీఎల్‌లో భువనేశ్వర్ ఇప్పటివరకు 154 వికెట్లు తీశాడు. అత్యధిక డాట్ వేసిన బౌలర్స్ జాబితాలో భువనేశ్వర్ తర్వాతి స్థానంలో సునీల్ నరైన్ ఉన్నాడు. నరైన్ 1391 డాట్ బాల్స్ వేయగా అశ్విన్ 1387 డాట్ బాల్స్‌తో మూడో స్థానంలో నిలిచాడు. హర్భజన్ నాలుగు, మలింగ ఐదో స్థానాల్లో ఉన్నారు.
ఐపీఎల్ ఆరంభ సీజన్స్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పూనే వారియర్స్‌కు ఆడాడు భువనేశ్వర్. ఆ తర్వాత అతడిని 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి సన్‌రైజర్స్ తరఫున ఆడుతున్నాడు భువనేశ్వర్. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ టీమ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భువనేశ్వర్ కొనసాగుతోన్నాడు.